Beauty Tips: ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలతో బాధడుతున్నారు. అయితే ఈ చలికాలం లో చల్ల నీటి స్నానం చెయ్యడం వల్ల జుట్టు చివర్లు పగులుతాయి. ఎందుకంటే చల్ల నీటి స్నానం వాళ్ళ జుట్టు తేమను కోల్పోతాయి. దీని వల్ల జుట్టు చివర్లు పగలడం జరుగుతాయి. అయితే ఈ సమస్యను ఎలా దూరం చేసుకోవాలో దానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక గిన్నె లో ఒక టీస్పూన్‌ షాంపూ తీసుకుని అందులో కొద్దిగా ఆముదం, గ్లిసరిన్‌, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తడిగా ఉన్న జుట్టుకు పట్టించాలి. ఒక పావుగంట తరువాత షాంపూతో కడుక్కోవాలి.

ఒక అరటిపండు, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ఆయిల్‌, ఒక టీస్పూన్‌ అలొవెరా జెల్‌… ఈ మూడింటిని కలిపి పేస్టులా చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. ఇక అరగంట తర్వాత నీటితో కడుక్కోనీ శుభ్రం చేసుకుంటే జుట్టు మృదువుగా మారుతుంది.

దీంతో పాటు జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత నీళ్లు పోసి రెండు రోజుల పాటు నానబెట్టాలి. ఇక ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్లను ఫ్రిజ్‌లో పెట్టుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి.

అలాగే రెండు స్పూన్ల మెంతులను రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ మెంతులను పేస్టులా పట్టుకుని.. కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడుకాయలతో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ కుంకుడుకాయలు లేకపోతే హెర్బల్‌ షాంపూ ఉపయోగించవచ్చు.

Beauty Tips: ఇలా చేస్తే ఈ సమస్య కొద్ది రోజుల్లోనే నయం..

అలాగే వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. ఇక అదే విధంగా కొబ్బరిపాలలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించుకోవాలి. ఇక నాలుగైదు గంటల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే ఈ జుట్టు చివర్ల పగుళ్ళ సమస్య దూరం అవుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 1, 2022 at 2:20 సా.