Gabbar Singh : నాలుగు పదుల వయసు దాటినప్పటికీ తన వన్నె తరగని అందంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి మలైకా అరోరా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి మలైకా అరోరా ఎక్కువగా గ్లామర్ షో, స్కిన్ షో వంటివి చేస్తూ బాగా పాపులర్ అయింది. అయితే తెలుగులో కూడా ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అంటూ అందాల ఆరబోసి ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. అయితే నటి మలైకా అరోరా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో పనిచేసింది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆఫర్లతో బిజీ అయినప్పటికీ తర్వాత మళ్ళీ మోడలింగ్ కంటిన్యూ చేసింది.
అయితే తాజాగా మలైకా అరోరా ముంబైలో జరిగినటువంటి ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొంది. ఇందులో క్లీవెజ్ మరియు గ్లామర్ షో చేస్తూ మొత్తం ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే నటి మలైకా అరోరా విలేకరులతో జరిగిన సమావేశం ముందు కొంతమంది వ్యక్తులతో బహిరంగంగా ముద్దులతో పలకరిస్తూ కనిపించింది. దీంతో ఇది గమనించిన ఫోటోగ్రాఫర్లు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే ఈ ఫోటోలలో నటి మలైకా అరోరా దుస్తుల గురించి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మలైకాకి నాలుగు పదుల వయసు దాటినప్పటికీ యంగ్ గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కుర్రకారు మతి పోగోడుతోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ అందానికే బాలీవుడ్ స్టార్ హీరోలు ఫిదా అయ్యి ఆఫర్లు ఇస్తున్నారంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి మలైకా అరోరా ఈ మధ్యకాలంలో వాళ్ళు స్పెషల్ సాంగ్స్ లో నటించడమే కాకుండా అడపాదడపా చిత్రాలకి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. మరోవైపు మోడలింగ్ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ బాగానే సంపాదిస్తోంది. అయితే నటి మలైకా అరోరా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడిపోయినట్లు కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే గతంలో అర్జున్ కపూర్ తన ప్రియురాలికి అందుబాటులో ఉండేందుకు తను ఉంటున్న ఏరియాలోనే ఖరీదైన ఇల్లుని కొన్నాడు. కానీ ఇటీవలే ఆ ఇంటిని వేరేవాళ్ళకి అమ్మేయడంతో ఈ వార్తలు మరింత బలవయ్యాయి.