Arohi : బిగ్ బాస్ ఇంట్లోంచి నాలుగో వారంలో బయటకు వెళ్లే కంటెస్టెంట్ పేరు లీకైంది. ఈ నాలుగో వారంలో ఆరోహి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అసలే ఓటింగ్‌లో దారుణాతి దారుణమైన స్థాయిలోకి పడిపోయింది ఆరోహి. సూర్య, ఆరోహి, సుదీప, రాజ్ ఇలా అందరికీ చాలా తక్కువ ఓటింగ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అందరిలోనూ ఆరోహి మరీ లీస్ట్లో ఉందని తెలుస్తోంది. అందుకే ఆమెను బయటకు పంపించేసినట్టు సమాచారం అందుతోంది.
ఇక ఆరోహి బయటకు వస్తే.. సూర్య ఏమైపోతాడో అని నెటిజన్లు కౌంటర్లు వేసుకుంటున్నారు. సూర్య ఆరోహి బంధానికి నెటిజన్లు సురోహి అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సూర్య ప్లస్ ఆరోహి సురోహి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సూర్య, ఆరోహి బంధం మీద ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఆరోహికి నందు అనే లవర్ ఉన్నాడు. ఇక సూర్యకు బుజ్జమ్మ అనే బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువైన అమ్మాయి ఉందట. బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ? అంటే అని నాగార్జున అడిగాడు.
ఏమో సరి మిస్టరీ బంధం.. చెప్పలేం సర్.. నాకు నందు ఎలాగో.. సూర్యకు బుజ్జమ్మ కూడా అలానే అని ఆరోహి క్లారిటీ ఇచ్చింది. తన కోసం నందు గేట్ బయట వెయిట్ చేస్తుంటాడు.. అలానే సూర్య కోసం బుజ్జమ్మ కూడా వెయిట్ చేస్తుంది అని ఆరోహి నిన్నటి ఎపిసోడ్లో చెప్పింది. అయితే ఇప్పుడు ఆరోహి ఎలిమినేట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఆరోహి ఎలిమినేషన్ గనుక నిజమే అయితే.. సూర్యకు పెద్ద దెబ్బ తగిలినట్టే అవుతుంది.
Arohi :
అసలే ఈ మద్య సూర్య మరింత డల్లుగా కనిపిస్తున్నాడు. ఈ ఫెమినిస్ట్ స్టార్ ఆరోహితో మరింత ఎక్కువగా క్లోజ్ అయ్యాడు. హగ్గుల్లో నలిపేస్తున్నాడు. అర్దరాత్రి ముచ్చట్లు పెట్టేస్తున్నాడు. మరి ఆరోహి వెళ్లిపోయాక సూర్య ఎలా ఉంటాడో చూడాలి.