Bigg Boss 5 Telugu : స్టార్ మా లో హయ్యస్ట్ టిఆర్పి రేటెడ్ రియాలిటీ షో గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రేక్షకుల మనసును ఎంతగానో దోచేసుకుంది. ఎన్నో రకాల ఆలోచనలు పని ఒత్తిడి వలన రోజంతా బిజీ బిజీగా ఉండే మనం రాత్రి పదైందంటే చాలు టీవీ ముందు కూర్చుని బిగ్ బాస్ షో కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక గంటలో మన ఆలోచనలను దూరం చేసి ఇంట్లో వారితో సరదాగా గడిపేటట్లు చేస్తోంది ఈ బిగ్ బాస్ షో. ఇక షో లో మాత్రం కంటెస్టెంట్లకు గొడవలు, చాటుమాటు ప్రేమలు, ఇటు ఏడుపులు ,అటు ఓదార్పులు, అన్నీ రుచి చూపిస్తాడు మన బాస్. సోమవారం వస్తే చాలు నామినేషన్స్ అంటూ ఫిట్టింగులు పెట్టే టాస్క్ లతో షోని మరింత ఆసక్తికరంగా మారుస్తాడు బిగ్ బాస్. ఇక ఈ వారం అంటే 32 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూస్తే….

నామినేషన్స్ తర్వాత కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ “రాజ్యానికి ఒకే రాజు” అనే టాస్క్ ఇస్తాడు. ఇందులో రవి ,సన్నీలకు రెండు రాజ్యాలను కేటాయించి ఇరువైపులా రాజులకు కొన్ని బంగారు నాణేలను ఇచ్చి చివరి వరకు ఎవరిదగ్గరైతే ఎక్కువ నాణాలు ఉంటాయో వారే కెప్టెన్సీ పోటిదారులుగా అర్హులు అని చెప్తాడు. కంటెస్టెంట్లు వారి వారి ఇష్టంగా సన్నీ రాజ్యం లో కొంతమంది రవి రాజ్యం లో కొంతమంది చేరుతారు.

ఇక ఆట లో భాగంగా కుస్తీ పోటీల్లో పోటీ పడడానికి ఒక్కో రాజ్యం నుంచి ముగ్గురు సభ్యులు పోటీ పడాల్సి వస్తుంది. సన్నీ రాజ్యం నుంచి మానస, జెస్సీ , ప్రియాంక… రవి రాజ్యం నుండి విశ్వ ,ఆని శ్వేత పోటీపడతారని రాజులు ప్రకటిస్తారు. మొదటి రౌండ్లో విశ్వ మానస్ లు పోటీపడగా రవి రాజ్యంలోని విశ్వ గెలుస్తాడు. రెండో రౌండ్ రాగానే జెస్సీ ,ఆని మాస్టర్ పోటీపడగా సన్నీ రాజ్యంలోని జెస్సీ గెలుస్తాడు. ఆట మధ్యలో షన్ను, సిరి ,జెస్సీ నాణాలను దొంగతనం చేసిన కారణంగా విశ్వా దమ్ముంటే ధైర్యంగా ఆడాలి ఇలా దొంగలా ఆడకూడదు అని గొడవ పడతాడు… తర్వాత మూడో రౌండ్లో శ్వేత , పింకీ లు పోటీపడగా రవి రాజ్యంలోని శ్వేత గెలుస్తుంది. చివరకు రవి రాజ్యం గెలుస్తుంది.

ఇక ఆట అయిపోయే సరికి అర్థరాత్రి అవుతుంది. అందరూ పడుకుంటారు… కానీ హమీద శ్రీరామ్ కి హగ్ ఇచ్చి మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ తో బాయ్ చెప్తుంది. శ్రీరామ్ కూడా పడుకోకుండా ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ మిస్సింగ్ ఫీలింగ్ తో పడుకుంటాడు.

Bigg Boss 5 Telugu : రెచ్చిపోయిన జెస్సీ చివరకు ఏం జరిగింది? Love birds లా హగ్లు ఫ్లైయింగ్ కిస్సులు ఛీ ఛీ ఇదేం లొల్లి!

ఇక టాస్క్ లో భాగంగా 150 నాణాల కోసం బోర్డుమీద సన్నీ, రవిల ఫోటోలు అతికించాల్సి ఉంటుంది. అందులో మానస్, జెస్సిలు సన్నీకి సపోర్ట్ చేయగా… రవికి విశ్వా , శ్రీరామ్ సపోర్ట్ చేస్తారు. సన్నీకి మద్దతుగా జెస్సీ ఒక రేంజ్ లో ఆడాడు… శ్రీరామ్ ఎంత పడగొట్టినా లేస్తూ.. దెబ్బలు తగిలించుకుంటూ మరీ ఆడి సన్నీ రాజ్యాన్ని గెలిపిస్తాడు. ఆటలో గెలిచినందుకు సన్నీ రాజ్యానికి 150 నాణాలు వస్తాయి. వెంటనే బిగ్ బాస్ లాక్కో లాక్కో తాడు అనే టాస్క్ ఇవ్వగానే అందులో కూడా సన్నీ టీం విజేతలుగా నిలుస్తోంది. ఇక కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరెవరు నిలుస్తారో ఎదురు చూడాల్సి ఉంది….

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 7, 2021 at 8:33 సా.