Bigg Boss 6 Telugu Day 13 Review: బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం ఒక్కొక్కడిని వాయించి వేయించి అవతల పారేశాడు నాగార్జున. అసలే రెండో సీజన్ మీద జనాలకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఇక కంటెస్టెంట్లు కూడా మరీ లేజీగా ఉన్నారు. మంచికి మారుపేరుగా కొందరుంటే.. శాంతస్వరూపులుగా కొందరున్నారు. అయితే ఎందుకు వచ్చామో తెలియనట్టుగా ఇంకొందరు కంటెస్టెంట్లున్నారు. ఏ పని చేయకుండా.. ఆటలు ఆడకుండా.. తిని పడుకోడానికి కొందరున్నారు. ఇలా అందరినీ నాగార్జున దుమ్ముదులిపేశాడు.
ఆట బాగా ఆడిన గీతూని నాగ్ పొగిడేశాడు. రేవంత్ ఆటను కూడా మెచ్చుకున్నాడు. కానీ అందరికీ నీతులు చెప్పడం, ఆడవాళ్లు ఇలా ఉండాలి.. అలా ఉండాలని చెప్పడం మానుకో అని హెచ్చరించాడు. పక్క వాళ్లను ఓడించాలని కాదు.. నువ్ గెలవాలని ఆడు.. నీ ఆట తీరు బాగా లేదు.. మార్చుకో అని ఫైమాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగ్. చంటి, సూర్యలు కెప్టెన్సీ టాస్కులను ఈజీగా తీసుకోవడంపై మందలించాడు.
అర్జున్ కళ్యాణ్ అయితే రేవంత్ మీద చాడీలు చెప్పడం తప్పా ఇంకేం ఆడటం లేదని అన్నాడు. పడుకోవడం తప్పా చేసిందేమీ లేదని అన్నాడు. అలా ఒక్కొక్కరి గురించి నాగ్ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ అయిన రాజ్ గురించి మాత్రం దారుణంగా కొన్ని మాటలు అనేశాడు. అడుక్కుని గెలవడం గెలుపు కాదు.. నువ్ కెప్టెన్ అయ్యావ్ గానీ అయిన తీరు నాకు నచ్చలేదు అంటూ రాజ్ పరువుతీసేశాడు నాగార్జున.
ఇక బాలాదిత్య, వాసంతి, శ్రీ సత్య, షానీ, సుదీప ఇలా కొంత మందిని నిలబెట్టి కడిగిపారేశాడు. మీరు ఉండి వేస్ట్ అని అవమానించాడు. ఏదైనా ఆట ఆడండి.. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వచ్చి ఉంటే.. ఇంట్లోంచి వెళ్లిపోండి.. మీరంతా ఉండి కూడా వేస్టే అని దారుణంగా మాటలు వదిలాడు నాగార్జున. అయితే ఇందులో భాగంగా ఓ టాస్క్ ఆడాడు. అంతో ఇంతో ఆడిన 11 కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు.
వేస్ట్‌గా ఆడిన తొమ్మిది మంది కంటెస్టెంట్లలో ఎవరు వేస్ట్ కంటెస్టెంట్ అన్నది తేల్చండి.. వారిలోంచి ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున హెచ్చరించాడు. దీంతో అందరూ తమ తమ అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. అయితే రాజ్ వంత వచ్చింది. ఆ సమయంలో నాగార్జున ఓ మాట అన్నాడు. చూశావా రాజ్.. ఓ వేస్ట్ ఆటగాడే.. ఇంకో వేస్ట్ ఆటగాడు ఎవరో చెబుతున్నాడు అని రాజ్ మొహం మీదే ఆ మాట అన్నాడు నాగార్జున.
Bigg Boss 6 Telugu Day 123 Episode: మొత్తానికి రాజ్ కెప్టెన్ అయిన తీరు మాత్రం ఎవ్వరికీ నచ్చనట్టుంది
ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండకపోవచ్చు. మొత్తానికి రాజ్ కెప్టెన్ అయిన తీరు మాత్రం ఎవ్వరికీ నచ్చనట్టుంది. మరి రాజ్ ఈ వారం కెప్టెన్‌గా తనది తాను నిరూపించుకుంటాడో లేదు చూడాలి. కంటెస్టెంట్ల ఓటింగ్‌తో వాసంతి, శ్రీ సత్య, షానీలు వేస్ట్ అని తేలింది. అందులోంచి ఆడియెన్స్ ఓటింగ్ కూడా సరిపోయిందని షానీ ఎలిమినేట్ అంటూ ప్రకటించేశాడు. ఇక్కడ జనాల్ని ఎంటర్టైన్ చేయలేకపోయినా కూడా.. బయట నటుడిగా అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అని షానీ వెళ్లిపోయాడు. కానీ షానీ జర్నీ వీడియోను కూడా ప్లే చేయలేదు. కంటెస్టెంట్లతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయలేదు.