Bigg Boss 6 Telugu Day 27 Review: బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం ఇచ్చిన హోటల్ వర్సెస్ హోటల్ టాస్కులో కంటెస్టెంట్లు ఆడిన ఆట తీరుని నాగార్జున సమీక్షించాడు. ఇక తమ వద్ద ఉన్న డబ్బుని మొత్తం ఖర్చు చేసి జీరోస్థాయికి వచ్చిన వారిపై నాగార్జున కౌంటర్లు వేశాడు. బాలాదిత్యకు కోపం రావడం, గీతూ ఏడ్వడం అద్భుతం అంటూ వారి మీద కూడా పంచులు వేశాడు నాగార్జు. ఇక ఆరోహి లవర్ నందు.. సూర్య లవర్ బుజ్జమ్మల గురించి కూడా బయటకు వచ్చేలా చేశాడు నాగార్జున.

ఒక్కో కంటెస్టెంట్ ఆట మెరుగుపడాలని మందలించాడు నాగార్జున. చంటి, ఇనయ, వాసంతి, రాజ్ వంటి వారిని నిలబెట్టి మరీ పరువుతీశాడు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కూడా మరిచిపోయావ్ కదా?.. ఇంకోసారి ఇలాంటి చేష్టలు చేయకంటూ చంటికి చురకలంటించాడు నాగార్జున. ఇకపై ఇలా చేయను అంటూ చంటి మాటిచ్చాడు. మరి వచ్చే వారాల్లో అయినా ఆడతాడా లేదా అన్నది చూడాలి. కీర్తి బాగానే ఆడిందని చెబుతూ.. ఆమె చేసిన తప్పుల గురించి చెప్పుకొచ్చాడు.

ఎంటర్టైన్ చేయలేదని, ఎక్కువగా కనిపించలేదని, క్యాబరే డ్యాన్స్ అంటూ అవమానించడంపైనా మందలించాడు నాగార్జున. క్యాబర్ డ్యాన్స్ అంటే నాకు తెలీదని, ఐటం సాంగ్ అనుకున్నా అంటూ కీర్తి చెబుతుంది. అలా చివరకు కీర్తికి 200 టిప్‌గా ఇచ్చాడు నాగార్జున. కస్టమర్‌గా వచ్చిన రాజ్.. నువ్ టిప్స్ తీసుకోవడం ఏంటి? అని కౌంటర్లు వేశాడు. రాజ్ ఆట తీరు మీద కామెంట్లు చేస్తూ పరువుతీసేశాడు. అయితే ఇలా అందరి గురించి చెబుతూ.. అందరికీ టిప్స్ ఇచ్చాడు నాగార్జున.

ఇనయ, చంటి, ఆదిరెడ్డి వంటి వారి ఆటకు నాగార్జున జీరో టిప్స్ ఇచ్చాడు. ఇంటి సభ్యుల ఓటింగ్ మేరకు.. ఈ ముగ్గురిలోంచి ఒకరికి సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అవకాశం ఉండదని అన్నాడు. దీంతో ఇంటి సభ్యులు ఓటింగ్‌లో ఇనయ, చంటిలకు ఒకేరకంగా పడ్దాయి. చివరకు కెప్టెన్ కీర్తి ఓటింగ్‌తో చంటికి దెబ్బ పడింది. తన పర్సనల్ రీజన్ అంటూ చంటికి కెప్టెన్సీ అర్హత లేకుండా చేసింది. నేను కెమెరాల కోసం పని చేస్తాను అని అన్నాడు.. అది నాకు నచ్చలేదంటూ చంటిని సెలెక్ట్ చేసి దెబ్బ కొట్టేసింది కీర్తి.

వాసంతి తాను ఎంత బాగా ఆడినా కూడా రెండొందలు టిప్ ఏంటని ఏడ్చేసింది. ఇక కెప్టెన్ అయినా కూడా తనను ఏ మాత్రం ప్రోత్సహించలేదని కీర్తి ఏడ్చేసింది. చివరకు బీబీ చాట్ భండార్ అనే టాస్క్ పెట్టాడు. ఇందులో ఉల్లిపాయలు వాడితే.. ఏడిపించేవాడని, ఉప్పు వాడితే హద్దుల్లో ఉండమని, చిల్లీ సాస్ వాడితే రూడ్ అని, ఆలూ వాడితే సోమరిబోతు అంటూ ఇలా కొన్ని కేటగిరీలు చెప్పుకొచ్చారు. కాకరకాయ వాడితే టాక్సిక్ అని, నీళ్లు అంటే.. వ్యక్తిత్వం లేని వాళ్లని అన్నారు.

Bigg Boss 6 Telugu Day 27 Episode: ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలను చెబుతూ మిగతా వారికి పానీ పూరిని తినిపించారు.

ఇలా ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలను చెబుతూ మిగతా వారికి పానీ పూరిని తినిపించారు. హద్దుల్లో ఉండాలని గీతూకి చంటి తినిపించాడు. చంటి విషపు మనిషి అంటూ గీతూ తినిపించింది. రేవంత్ హద్దుల్లో ఉండాలంటూ ఆదిరెడ్డి ఉప్పు కలిపింది తినిపించాడు. గీతూకి ఎక్కువగా ఆలూ అంటే బద్దకస్తురాలు అని తినిపించారు. సుదీప, ఫైమా, వాసంతి, రాజ్, సూర్య వంటి వారికి ఏ ఒక్కరూ కూడా పానీపూరి ఇవ్వలేదు. ఆరోహి మాట తీరు రూడ్‌గా ఉంటుందని శ్రీ సత్య తినిపించింది. రేపు విజయదశమి అని.. నామినేషన్లో ఉన్న వారందరి సంగతిని ఆదివారం చూద్దామని అన్నాడు నాగార్జున.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 2, 2022 at 2:01 ఉద.