Bigg Boss బిగ్ బాస్ ప్రోగ్రాం ఆధ్యంతం ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్ లు రెచ్చిపోయి మరీ గేమ్ ఆడుతున్నట్లు చూస్తున్నాం. బూతులు తిట్టుకోవడం, ఆడ, మగ తేడా లేకుండా ఒకరి పైన ఒకరు పడుతూ ఆవేశంతో ఆడుతున్నట్లు కనబడుతున్నారు. అలానే పలువురు కంటెస్టెంట్ లు నోరు ఉంది కదా అని… ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కూడా… బిగ్ బాస్ వారికి ఎటువంటి అడ్డు చెప్పకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం…
ఎపిసోడ్ ప్రారంభం లోనే సన్నీ- ప్రియల మధ్య పెద్ద గొడవ జరిగింది. సన్నీతో… నీ యాటిడ్యూడ్ నా దగ్గర చూపించకు నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని ప్రియా ఆవేశంగా చెప్తుంది. ఇందుకు బదులుగా అలా అనడం తప్పు అని సన్నీ చెప్తాడు. అయితే ‘షట్ అప్ అని కూడా అంటాను అని ప్రియా చెప్పడంతో… మీరే కాదు నేను కూడా మాట్లాడగలను అని సన్నీ హెచ్చరిస్తాడు. అంతకు ముందు ‘ హే పో అని నువ్వు చెప్పినప్పటి నుంచి నీపై నాకు గౌరవమే పోయింది అంటూ… సన్నీపై… ప్రియ మంది పడుతుంది. అలా వారి మధ్య వాడి వేడి గా సంభాషణ జరుగుతుంది.
అనంతరం టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అంతా రెండుగా విడిపోయి… సాగరా సోదరా అనే కాళ్లు చాపి కొలతలు కొలిచే ఆట ఆడతారు. ఆట చివర్లో వారి మధ్య గొడవ రేకెత్తగా… విజేతలు ఎవరో చెప్పకపోతే టాస్క్‌ని రద్దు చేస్తాం అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఇంటి సభ్యులు ఏ టీం గెలుపును చెప్పకపోవడంతో… బిగ్ బాస్ టాస్క్‌ని రద్దు చేస్తున్నట్లు ఆదేశిస్తాడు. ఆ తర్వాత శ్రీ రామ చంద్ర టీం సభ్యులు సందడి చేస్తుంటే… టాస్క్ రద్దు చేశారంటే మనం సిగ్గుతో తలదించుకోవాలని రవి అంటాడు. సిగ్గు పడాల్సింది మీరే అంటూ… ప్రియ కౌంటర్ ఇస్తుంది.
టాస్క్ రద్దు చేసిన తర్వాత శ్రీరామ చంద్ర – రవి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నీ గేమ్ నువ్వు ఆడు, నాతో మైండ్ గేమ్ ఆడకు… నేను ఇక్కడికి రూ.50 లక్షల కోసం రాలేదని చెప్తాడు. నేను తెలుగు వాళ్లతో బాండింగ్ పెంచుకోవడానికే ఇక్కడకు వచ్చానని… ఆ డబ్బులు వాళ్ల ముఖంపై కొట్టేసి వెళ్తా అనడం గమనార్హం. ఈ నేపధ్యం లోనే శ్రీరామ్ – మానస్‌ల మధ్య కూడా సీరియస్ డిస్కషన్ నడిచింది. నా వయసు 34 , నీ వయసు 28 ఎలా చేయాలో నాకు తెలుసు నీకు మెచ్యూరిటీ లేదు అని శ్రీరామ్ చంద్ర … మానస్ తో అంటాడు. వయసుకి మెచ్యురిటీకి సంబంధం లేదు అని మానస్ గట్టిగానే కౌంటర్ ఇస్తాడు. లోబో తన కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకొని కొంచెం సేపు ఎమోషనల్ అవుతాడు.
శ్రీరామ్ – సన్నీ, విశ్వ – నటరాజ్‌మాస్టర్ లు దాదాపు కొట్టుకుంటున్నారు అనేంతలా రెచ్చిపోయి మరీ గొడవ పడుతూ ఉంటారు. మగవారికి మేము ఏ మాత్రం తక్కువ కాదంటూ ఆడ వాళ్ళు కూడా తమదైన శైలిలో రెచ్చిపోయారు. ఉమా టాస్క్ఉ లో భాగంగా అందర్నీ కొట్టుకుంటూ, నెట్టుకుంటూ వెళ్లడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అలానే యానీ మాస్టర్ – ఉమాదేవి ఒకర్నొకరు తూ.. తూ అనుకుంటూ… తీవ్ర విమర్శలు చేసుకోవడం ప్రేక్షకులకు కూడా మింగుడు పడని విషయం. ఇక చివర్లో ఆడూ ఈడూ అని సన్నీని ఉద్దేశించి ప్రియ మాట్లాడటంతో… సన్నీకి కోపం వచ్చి ఆడు ఈడు ఏంటి అని అడుగుతాడు. ఆడు అంటే నువ్వేనా అంటూ, దమ్ముంటే వచ్చి మగాడిలా ఆడాలని ప్రియ అనడంతో.. రా ఆడదాం మగతనం చూపిస్తా అంటూ సన్నీ అనడంతో పెద్ద గొడవ జరుగుతుంది. అంతా అయిపోయిన తరువాత చివర్లో బిగ్ బాస్ హౌస్‌లో శారీరక హింస చేయడం నేరం… అలా చేయొద్దు’ అంటూ చెప్తాడు.