BiggBoss5 Telugu : యాంకర్ రవికి అన్యాయం చేశారంటూ…అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్యాన్స్ రచ్చ

Bharath Cine Desk

BiggBoss5 Telugu : ఈవారం హౌస్ లో నుండి యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం అనేది బుల్లితెర ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం. హౌస్ లో తన గేమ్ ప్లాన్ తో.. టాస్క్ లను రసవత్తరంగా చేసి..షో ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చారు. దీంతో రవి టాప్ 5 లో కచ్చితంగా ఉంటాడని అందరూ భావించారు. కానీ తాజాగా పన్నెండో వారమే హౌస్లో నుండి బయటికి రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. తక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున చెప్పినా అది వినడానికి నమ్మశక్యంగా లేదు

ఈ క్రమంలో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారనే వార్త తెలిసిన ఫ్యాన్స్ బిగ్ బాస్‌లో రవికి అన్యాయం జరిగిందంటూ ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట రచ్చ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని.. ఆఫీషల్ ఓటింగ్ ఆర్డర్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రవి లేకుంటే అసలు బిగ్ బాస్ ఎందుకు? అంటూ.. మళ్లీ రీ ఎంట్రీగా రవిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని రవి ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు.


ఓటింగ్స్ లో యాంకర్ రవి కన్న తక్కువ ఓట్లు వచ్చిన వారిని హౌస్ లో ఎందుకు కొనసాగిస్తున్నారని.. ఓటింగ్ పరంగా చూస్తే మూడో స్థానంలో ఉండే యాంకర్ రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షో టిఆర్పి కోసం రవి కి అన్యాయం చేశారంటూ రవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు తన ఎలిమినేషన్ పై తాజాగా యాంకర్ రవి కూడా స్పందించారు. తను ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదని.. మొదట ఎలిమినేట్ అయినప్పుడు కొంచెం బాధ పడ్డా.. తర్వాత బయటకు వచ్చి ప్రేక్షకుల అభిమానం చూస్తే నాదే గెలుపు అని అనిపిస్తుంది. నేను హౌస్ లో బాగా ఆడానని, తనకు అన్యాయం జరిగిందని జనం నమ్ముతుండటం పట్ల గర్వంగా ఉందని రవి తెలిపారు. తన ఎలిమినేషన్‌పై పూర్తి అనాలిసిస్ చేస్తానని యాంకర్ రవి పేర్కొన్నారు.

- Advertisement -