BiggBoss5 Telugu : 13th వీక్ నామినేషన్ లిస్ట్ వచ్చేసింది…ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనేనా..!?

Bharath Cine Desk

BiggBoss5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఏ వారం ఏ కంటెస్టెంట్ బయటికి వస్తాడో కూడా తెలియడం లేదు. ఈసారి హౌస్లోకి 19 మంది ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే హౌస్ లో ఉన్నారు. నిన్న ఆదివారం ఎపిసోడ్ లో యాంకర్ రవి హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి కి నామినేషన్ లో ఉన్న చాలామంది వీక్ కంటెస్టెంట్ల్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ఆశ్చర్యకరమైన విషయమే . కొందరేమో బిగ్ బాస్ షో టిఆర్పి కోసం ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. మరికొందరేమో అవును నిజంగానే రవి కి ఓట్లు తక్కువ పడ్డాయి కావచ్చని అంటున్నారు. 9 వారాలు నామినేట్ అయిన కంటెస్టెంట్ కి.. బయట ఫ్యాన్ బేస్ అనేది స్ట్రాంగ్ గానే ఉంటాది.. మరి ఈ వీక్ యాంకర్ రవి కి ఓట్లు తక్కువ పడ్డాయని చెప్పడం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది

అయితే ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసా? ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు తెలుసా ? ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఏంటంటే బాల్ ని తాని నామినేట్ చేయాలి. ఇందులో హౌస్మేట్స్ ని రెండు గ్రూపులు గా బిగ్ బాస్ విభజించారు

గ్రూప్ 1 : ప్రియాంక సింగ్, సన్నీ, సిరి
గ్రూప్ 2 : కాజల్ , మానస్, శ్రీ రామచంద్ర

షణ్ముఖ్ కెప్టెన్ కాబట్టి ఏ గ్రూపులో లేడు. ఈ మేరకు 13వ వారం నామినేషన్లో కెప్టెన్ అయినా షణ్ముఖ్, సన్నీ తప్ప మిగతా వారందరూ ఉన్నారు. సన్నీ మొదట నామినేట్ అయిన తర్వాత సేవ్ అవుతాడట. ఇంకా నామినేటెడ్ అయిన సభ్యులు ఎవరంటే కాజల్ ప్రియాంక సింగ్, మానస, సిరి, శ్రీ రామచంద్ర. వీళ్లలో శ్రీరామచంద్ర స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఓటింగ్స్ లో టాప్ లోనే ఉంటాడు. ఇక పోటీ అంతా మానస, సిరి, కాజల్, ప్రియాంక మధ్యనే.. మిగితా వాళ్లతో పోలిస్తే ప్రియాంక కొంచెం వీక్.. కాబట్టి ఈ వారం హౌస్లో నుండి ప్రియాంక ఎలిమినేట్ అయ్యే ఛాన్సుంది.

హౌస్ లో నుండి ఇంకా ఇద్దరు వెళ్ళిపోతే.. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ యే ఉంటారు. ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ఎవరో అవుతారో వాళ్లు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు సువర్ణభూమి 300 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ కూడా సాంతం చేసుకోబోతున్నారు.

- Advertisement -