BiggBoss5 Telugu: అప్పట్లో బిగ్ బాస్ నా కప్ ఆఫ్ టి కూడా కాదు అన్నా లోబో.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లి ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా ???

Bharath Cine Desk

BiggBoss5 Telugu: బుల్లితెర లో టిఆర్పీతో రికార్డులు సృష్టిస్తు.. ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రియాలిటీ షో “బిగ్ బాస్”.. హిందీ,తెలుగు, తమిళ్, కన్నడ మరాఠీ భాషలో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్.. తమిళ్ లో కమలహాసన్.. తెలుగులో నాగార్జున ఈ సారి సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సారి బిగ్ బాస్ 5 సాదా సీదాగా నడుస్తుంది. రోజు హౌస్ లో గొడవలు తప్ప… ఎంటర్టైన్మెంట్ అనేదే లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. మొదటి వారం నుండి హౌస్లో కేళి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ బయటకు వస్తున్నారు. ఇప్పటివరకు యూట్యూబెర్ సరయు, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీదా, శ్వేత వర్మ, ఆర్టిస్ట్ ప్రియా, లోబో ఎలిమినేట్ అయ్యారు.

తొలుత లోబో ఎంటర్టైన్మెంట్ చేసిన… ఆ తర్వాత లోబో హౌస్ లో సాదా సీదాగా మెలిగాడు. బిగ్ బాస్ లోబో కి అద్భుతమైన సీక్రెట్ రూం అవకాశని ఇచ్చాడు.. కానీ లోబో దాని ఉపయోగించుకోలేదు. సీజన్ 4 లో అఖిల్ బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ రూమ్ అవకాశాన్ని అందిపుచ్చుకొని..తన గేమ్ ప్లాన్ మార్చుకుని..బిగ్ బాస్ సీసన్ 4 రన్నర్ అప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ లోబో కి అద్భుతమైన ఛాన్స్ వచ్చినా గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకోలేదు. దీంతో గతవారం ఓటింగ్స్లో చివరి స్థానంలో ఉండడంతో… లోబో హౌస్ లో నుండి బయటకు వచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు లోబోకు రోజుకు 35 వేల రూపాయ‌లు లెక్క‌లో వారానికి దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చేటట్లు నిర్వాహకులతో డీల్ కుదిరింద‌ట‌. ఆ లెక్క‌లో చూస్తే లోబో బిగ్‌బాస్ హౌస్‌లో 8 వారాలు కొన‌సాగాడు అంటే దాదాపు 20 ల‌క్ష‌ల రూపాయ‌లను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -