బిగ్ బాస్ ప్రతి రోజు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. కానీ ఈరోజు మాత్రం ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుందని చెప్పొచ్చు. కాగా నేటి ఎపిసోడ్ లో జెస్సి – కాజల్ సోఫాలో కూర్చొని ఇంట్లోని వారి గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కిచెన్ లో జరిగిన విషయం గురించి పలువురు ఇంటి సభ్యులపై ఉమాదేవి కోప్పడుతుంది. ఆ క్రమంలోనే ఉమా – లోబో ఒకరిపై ఒకరు కొద్దిసేపు సెటైర్ లు వేసుకుంటారు.

ఆ తర్వాత రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంట్లోని సభ్యులందరినీ రెండు గ్రూపులుగా విడిపోవాలని బిగ్ బాస్ఆదేశించారు. ఈ మేరకు రెండు గ్రూపులుగా విడిపోయిన సభ్యులు ఒక్కొక్కరు ఇద్దరు వేరే గ్రూప్ కంటెస్టెంట్ లను ఎన్నుకోవాలని సూచించారు. సిరి కెప్టెన్ అయిన కారణంగా ఎవరు ఆమెని నామినేట్ చేయరు.

మొదటగా సిరి… ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేస్తుంది. నటరాజ్ మాస్టర్… ప్రియ, ప్రియంకా లను నామినేట్ చేస్తారు. యాని మాస్టర్…ఉమాదేవి, ఆర్జే కాజల్ ను… సన్నీ… ప్రియ, ప్రియాంక లను నామినేట్ చేస్తాడు. ప్రియాంక సింగ్… నటరాజ్ మాస్టర్, సన్నీ లను నామినేట్ చేస్తుంది. మానస్… లోబో , ప్రియ లను నామినేట్ చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తయితే … ఇక్కడి నుంచి ఒక ఎత్తుల జరిగింది అని చెప్పొచ్చు.

అనంతరం విశ్వ కంటెస్టెంట్ లను నామినేట్ చేసేందుకు వచ్చిన క్రమంలో … అతనికి ఉమాదేవికి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో ఉమాదేవి హద్దులు ధాటి మాట్లాడినట్లు గమనించవచ్చు. చాలా ఆవేశంతో బూతు మాటలు మాట్లాడటంతో… ఒక్కసారిగా ఇంట్లోని సభ్యులంతా షాక్ కు గురయ్యారు. నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా నేను ఆ మాటలను వినకుండా ప్రవర్తించడం అంటే … నేను ఒక వె ***** అని అనడం ఒక పెద్ద తప్పుగా పరిగణించాలి. అదే విధంగా కంటెస్టెంట్ లను నామినేట్ చేసేందుకు ఉమాదేవి వచ్చినప్పుడు కూడా … దమ్ము, ధైర్యం ఉన్న వాళ్ళు సత్తా ఉన్న వాళ్ళు వంటి పదాలను వాడుతూ ఉమాదేవి యాని మాస్టర్ తో గొడవ పడటం ప్రేక్షకులకు కూడా మింగుడు పాడనీ అంశమే. అదే విధంగా తనకి రెస్పెక్ట్ ఇవ్వొద్దు అనడం లాంటి మాటలను బట్టి ఆమె ఏమి మాట్లాడుతుందో ప్రేక్షకులతో పాటు ఆమెకు కూడా తెలియట్లేదా అనేలా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

Anee Master gets emotional and upset with Uma

అనంతరం లోబో … రవి, శ్వేతా వర్మ లను నామినేట్ చేసాడు. ఈ ఎపిసోడ్ కు మరో హైలైట్ లా మారిన కంటెస్టెంట్ అంటే శ్వేతా వర్మని చెప్పాలి. కంటెస్టెంట్ లను నామినేట్ చేసేందుకు ఆమె వచ్చాక… హమీద, లోబో లను నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే వారిపై ఓ రేంజ్ లో ఆమె ఫైర్ అయ్యింది. అదే విధంగానే ఉమాదేవి పై కూడా తన మాటలతో శ్వేతా వర్మ విరుచుకు పడింది. రెస్పెక్ట్ గురించి, ఆడవారి మనోభావాల గురించి మాట్లాడటంతో ఇంటి సభ్యులు చప్పట్లు కొట్టడం గమనించవచ్చు. అలానే వారిపై ఆవేశంతో రంగు పూయడంతో హమీద, లోబో ను ఇంటి సభ్యులు ఓదార్చిడం… తర్వాత వారికి ఆమె క్షమాపణ చెప్పడంతో అంత సర్దుకుంది.

షన్ను…ఉమా, జెస్సిలను నామినేట్ చేస్తాడు. ఆర్జే కాజల్ కూడా… యాని మాస్టర్, విశ్వ లను నామినేట్ చేసి పలువురు ఇంటి సభ్యులపై మండిపడింది. ప్రియ… సన్నీ నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేస్తుంది. జెస్సి… శ్రీరామ చంద్ర, లోబో లను… శ్రీ రామ చంద్ర … నటరాజ్ మాస్టర్ , ఆర్జే కాజల్ లను నామినేట్ చేస్తాడు. రవి… ప్రియాంక, శ్రీరామ చంద్ర లను నామినేట్ చేస్తాడు.

చివరగా… ఈ వారం ఎలిమినేషన్ కొరకు నామినేట్ అయిన సభ్యులు… టీం వూల్ఫ్ నుంచి ఉమా, నటరాజ్, కాజల్ … టీం ఈగల్ నుంచి లోబో, ప్రియాంక , యాని, ప్రియ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటిస్తాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe,...

Mail

Published on సెప్టెంబర్ 13, 2021 at 11:54 సా.