Amazon deals : అమెజాన్ తన యాన్యూయల్ సేల్ లో భాగంగా కేవలం తక్కువ బడ్జెట్ లోనే టాప్ బ్రాండ్స్ పై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. ఒకవేళ మీరు కొత్త ఇయర్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ సేల్ మీకు సోనీ, వన్ ప్లస్ , జేబీఎల్, రియల్ -మీ లాంటి టాప్ బ్రాండ్స్ నుండి తక్కువ బడ్జెట్ లో చాలా ఆప్షన్స్ అందిస్తోంది.
వన్ ప్లస్ ఇయర్ బడ్స్ Z2
2022 ఎడిషన్ సేల్ సమయంలో, వన్ ప్లస్ బడ్స్ Z2 సేల్ లో డిస్కౌంట్ తగ్గింపు రూ. 1,400 పోగా 4,599/- వద్ద అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం కంపెనీ నుండి వచ్చిన మొదటి TWS ఇయర్‌బడ్‌లు ఇవి. ఈ ఇయర్‌బడ్‌లు 40dB వరకు యాక్టివ్ బయటి శబ్దాలను నిర్మూలిస్తాయి. 11ఎన్ఎన్ డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉండి , ఇది బిగ్గరగా, స్పష్టమైన మరియు బాస్ అవుట్‌పుట్‌ను అందిస్తూ మరియు కాల్ల కోసం మూడు మైక్రోఫోన్ల సెటప్ ఇందులో ఉన్నాయి.
రియల్ మీ బడ్స్ Q2s
రియల్ మీ బడ్స్ Q2s TWS ఇయర్‌బడ్‌లు 10mm డైనమిక్ బాస్ డ్రైవర్‌ను కలిగి ఉంటాయి మరియు ధర రూ. 1999/- అయితే సేల్ లో తగ్గింపు రూ. 1,500 డిస్కౌంట్ పోయి కేవలం 1999 కే ఈ ఇయర్ ఫోనులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, ఇది వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే ఛార్జింగ్ కేస్‌తో సహా 20 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని దీంట్లో స్పెషల్ ఫీచర్. కేవలం పది నిముషాల ఛార్జింగ్ తో 3 గంటల ప్లే బ్యాక్ పొందవచ్చు.
ఒప్పో ఎన్‌కౌ M32 వైర్లెస్ ఇయర్ఫోన్లు
ఒప్పో ఎన్‌కౌ M32లో అందుబాటులో ఉన్న నెక్‌బ్యాండ్ డిజైన్ ధర డిస్కౌంట్ 1400 పోయి రూ. 1,599 /-కు అమెజాన్ లో లభిస్తుంది. ఇక పూర్తి ఛార్జ్‌తో, ఈ వైర్లెస్ ఇయర్ఫోన్లు 28 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో దాదాపు 20 గంటల సమయాన్ని ఇస్తోంది.
సోనీ WF-C500 వైర్ లెస్ బ్లూటూత్
ఈ పరికరం ఎర్గోనామిక్ డిజైన్‌తో వస్తుంది. ఇక సోనీ W ఫ్ – సీ 500 బ్లూ టూత్ ధర 4,490/-అయితే సేల్ లో త్వరిత బ్యాంకు డిస్కౌంట్ 1000 రూపాయలతో ఈ ధరకు సోనీ బ్లూ టూత్ ఇయర్ ఫోన్లు లభిస్తాయి. ఇక ఇందులో స్పెషల్ ఫీచర్ ఇది ఛార్జింగ్ కేస్‌తో వస్తుంది, ఇది 20 గంటల బ్యాటరీ జీవితాన్ని మరియు ఛార్జింగ్ కేస్ లేకుండా 10 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇంకా, ఇది కంపెనీ స్వంత సౌండ్ ఇంజిన్‌ను అందిస్తూ DSEE మరియు IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది.
JBL ట్యూన్ 230 NC
2,500 బ్యాంక్ డిస్కౌంట్ తో జేబీఎల్ ట్యూన్ 230 NC ధర కేవలం రూ. 4,950/-. జేబీఎల్ ట్యూన్ 230 NC ఫీచర్లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది ఛార్జింగ్ కేస్‌తో సహా 40 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. అది కాకుండా, ఇయర్‌బడ్‌లు సర్దుబాటు చేయగల ఈక్వలైజర్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్‌కు కూడా మద్దతు ఇస్తాయి.
జేబీఎల్ ట్యూన్ 130 NC
ఫ్లాట్ 36% తగ్గింపుతో జేబీఎల్ ట్యూన్ 130 NC ధర 4,499/- రూపాయలు కాగా డిస్కౌంట్ 2,500 లభిస్తోంది. ఇది మాక్సిమమ్ 40dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేస్తుంది.మరియు జేబీఎల్ యాప్‌కు అనుకూలంగా ఉండే ఛార్జింగ్ కేస్‌తో సహా 40 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తోంది.
ఒన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ Z2
అమెజాన్ సమ్మర్ సేల్‌లో వన్ ప్లస్ బుల్లెట్ వైర్ లెస్ z 2 పై 17% ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఇక దీని ధర రూ. 400 తగ్గింపుతో రూ. 1,899/- గా ఉంది. ఇది నెక్‌బ్యాండ్-స్టైల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్లతో వస్తుంది, ఇది IP55 దుమ్ము మరియు వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో పాటు 30 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తోంది.