Business Idea: ఈమధ్య చాలామంది జాబ్ లపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదైనా చిన్న బిజినెస్ అయినా సరే పెట్టుకొని బాగా సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే జాబు కంటే ఎక్కువగా వ్యాపారాల ద్వారా సంపాదించవచ్చు కాబట్టి. ఈ జనరేషన్లో మాత్రం ఉద్యోగాలు చేసే వాళ్ళ కంటే వ్యాపారాలు చేసేవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు.
ముఖ్యంగా చదువు రాని వారు కూడా వ్యాపారులలో బాగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి లక్షలలో సంపాదిస్తున్నారు. కాబట్టి వ్యాపారాలు చేయాలనుకునే వారికి ముందుగా వచ్చే ఐడియా క్యాటరింగ్ బిజినెస్. ఈ బిజినెస్ మాత్రం ఎప్పటికీ బాగా నడుస్తూనే ఉంటుంది. ఈ బిజినెస్ చేయటానికి చాలామంది ఎంత ఖర్చు అవుతుందో అని వెనుకడుగు వేస్తున్నారు.
కానీ కేవలం పదివేలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చని తెలుస్తుంది. ఒక్కసారి పదివేలు పెట్టి ఈ బిజినెస్ మొదలు పెడితే 50 వేల నుండి లక్ష వరకు సంపాదించుకోవచ్చు. అవును కేవలం పదివేల
తోనే ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఇక ఈ బిజినెస్ చేయడానికి కేవలం రేషన్, ప్యాకేజింగ్ లకు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఇక క్యాటరింగ్ కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేసుకొని తెలిసిన వాళ్ల ద్వారా ఈ సర్వీస్ మొదలు పెడుతున్నాము ఒక్కసారి చెప్పినట్టు అయితే వెంట వెంటనే ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ప్రారంభంలో కొన్ని రోజుల వరకు అంటే ఈ బిజినెస్ గురించి ప్రజలకు తెలిసే వరకు మొదట్లో 25 వేల వరకు సంపాదించుకోవచ్చు.
Business Idea:
అలా ఆర్డర్లు వస్తున్న కొద్ది సంపాదన లక్ష వరకు చేరుకుంటుంది. అంతేకాకుండా మరో వెహికల్ తో క్యాటరింగ్ బిజినెస్ కూడా మొదలు పెట్టొచ్చు. అలా ఆర్డర్స్ ఎక్కువ వస్తున్న కొద్ది బిజినెస్ బాగా రన్ అవుతుంది. కాబట్టి క్యాటరింగ్ బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నవాళ్లు ఒక్కసారి ఆలోచించి ఇందులో అడుగుపెట్టండి. ఆ తర్వాత దీని గురించి మీరే ఇంకొకరికి సలహాలు ఇస్తూ ఉంటారు.