Business Idea: భారతదేశ అగ్రగామి దేశాల్లో ఒకటి మరియు ఆక్వాకల్చర్ ఉత్పత్తికి ప్రధాన సహకారి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల చేపలు ప్రజల ఆహారపు అలవాట్లలో అంతర్భాగం. ఆక్వాకల్చర్ మరియు క్యాప్చర్డ్ ఫిషరీస్ చేపల సరఫరాకు ప్రధాన వనరులు. మనం చేపల పెంపకాన్ని ఇన్నాళ్లు చెరువులలోనూ, వ్యవసాయ క్షేత్రాలలోనూ చేయటం తెలుసు.
కానీ ఇప్పుడు కొత్తగా బయోఫ్లాక్ విధానంలో కొంచెం స్థలంలో కూడా చేపల పెంపకాన్ని కొనసాగించవచ్చు. ఈ విధానంలో కూడా ఉత్పత్తి ఎక్కువగానే అవుతుంది. ఖర్చు తక్కువ మెరుగైన ఆదాయ అవకాశాలు ఉంటాయి. మామూలుగా అయితే నీటిలో వేసిన చేపల దానాన్ని చేపలు చాలా తక్కువ మొత్తంలో వినియోగిస్తాయి. మిగిలిపోయిన ఫీడ్ క్షీణించి విషపూరితంగా మారుతుంది.
మరియు చెడు వాసనని కూడా వెద జల్లుతుంది. బయోఫ్లాక్ చేపల పెంపకం విధానంలో మిగిలిపోయిన ఫీడ్ తో పాటు చేపల విసర్జన కూడా చేపలు తినగలిగే మేతగా మార్చబడుతుంది. సూక్ష్మజీవులు శిలీంద్రాలు మొదలైన వాటి కలియక వల్ల బయోఫ్లాక్ ఏర్పరుస్తుంది. ఇది అర్బన్ వ్యర్ధాలను గ్రహిస్తుంది అందువల్ల నీటి నాణ్యత పెరుగుతుంది.
దీనివల్ల నీటి కాలుష్య సమస్య తీరటంతో పాటు ఫీడింగ్ మీద అధిక పెట్టుబడి కూడా అవసరం లేదు. ఒడిశాలోని ఫిషరీస్ అండ్ అనిమల్ రిసోర్సెస్ ఇటీవల ఆక్వా కల్చర్ను పెంచడానికి బయోఫ్లాక్ ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్లుగా ప్రకటించింది. సూక్ష్మజీవులు మరియు మొలాసిస్ వంటి కార్బన్ మూలం ట్యాంక్ నీటిలో ఉన్న సేంద్రియ వ్యర్ధాలపై పనిచేసే చేపలకు ఆహారంగా పనికొచ్చే ఉత్పత్తులుగా మారుస్తాయి.ఇటువంటి వ్యవస్థలను చేపల పెంపకం దారులు డాబాలు, పెరట్లో అమర్చుకోవచ్చు.
Business Idea:
వాణిజ్యపరంగా వినియోగదారులకు ప్రత్యక్ష లేదా లైవ్ చేపలను విక్రయించడానికి ఇది రైతులకు ఉపయోగపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నాలుగు చిన్న ట్యాంకుల్లో రెండు వేల కిలోల చేపలను పెంచడానికి 150 నుంచి 200 చదరపు మీటర్లు విస్తీర్ణంతో పాటు తగినంత నీటి సరఫరా సరిపోతుంది.కార్ప్, మాగూర్, అనాబాస్ వంటి వివిధ రకాల మంచినీటి చాప జాతులను సులభంగా పెంచుకొని లాభాలను గడించవచ్చు.