Business Idea: బిజినెస్ చేయడం అంటే చాలామంది ఆసక్తి చూపించినా కూడా ముందుకు రాలేకపోతుంటారు. ఎందుకంటే బిజినెస్ చేయాలి అంటే చేతిలో పెట్టుబడి పెట్టే అంత డబ్బు ఉండాలి కాబట్టి. మామూలుగా బిజినెస్ ప్రారంభించేటప్పుడు మొదట్లో కాస్త ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కానీ బిజినెస్ బాగా రన్ అవుతుంటే పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ లాభం పొందవచ్చు. బిజినెస్ రంగాల వైపు అడుగుపెట్టిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కువ లాభాలు అందుకుంటూనే ఉన్నారు. అయితే పెద్ద పెద్ద బిజినెస్ లే కాకుండా చిన్న చిన్న బిజినెస్ లు పెట్టడం వల్ల కూడా మంచి లాభం అందుకోవచ్చు. ఇంతకు ఆ బిజినెస్ ఏంటో చూద్దాం.
ఎరువులు, విత్తనాల అమ్మకం: ప్రస్తుతం మార్కెట్లో ఎరువులు, విత్తనాలు అమ్మే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే రైతులు తమ పంట పొలాలకు ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవడానికి దూరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారికి ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వారికి దగ్గరలో ఉండేటట్టు మంచి ప్రాంతాన్ని ఎంచుకొని ఈ బిజినెస్ నడిపిస్తే చాలు లాభం ఎక్కువగా ఉంటుంది. పైగా తక్కువ పెట్టుబడి తో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు.
గ్రామం ఉత్పత్తులను నగరాలలో అమ్మటం: మామూలుగా నగరాలలో ఉండేవాళ్ళు గ్రామంలో దొరికే ఉత్పత్తులను బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా గ్రామాలలో పండించే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే ఇవి చాలా వరకు పట్టణంలో దొరకవు. కాబట్టి గ్రామాలలో పండించిన కూరగాయలను, పాలపదార్థాలను, ఆహార పదార్థాలను నేరుగా పట్నం కి వెళ్లి అమ్మడం ద్వారా మంచి లాభం ఉంటుంది.
Business Idea:
కోల్డ్ స్టోరేజ్: ఈ మధ్యకాలంలో దొరుకుతున్న రసాయనిక పదార్థాల వల్ల పండ్లు, కూరగాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. దీంతో ఎక్కువ కాలం నిలువ ఉండటానికి.. ఒక చిన్నపాటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్ల పండ్లను, కూరగాయలను ఎప్పటికప్పుడు తాజాగా అమ్మవచ్చు. ఈ బిజినెస్ లే కాకుండా మరిన్ని చిన్న చిన్న బిజినెస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.