Business ideas: ఎప్పుడైతే దేశాన్ని కరోనా పట్టిపీడించిందో అప్పటినుంచి అందరి తలరాతలు మారిపోయాయి. కొంతమందికి తినడానికి తిండి లేని సందర్భాలు కూడా వచ్చాయి. ఎంతోమంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. దీంతో చేసేదేమీ లేక సొంత గ్రామాల్లోకి వెళ్లి వ్యవసాయం చేత పట్టారు. ఉద్యోగాలను నమ్ముకోవడం వేస్ట్ అనుకోని చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని అనుకున్నారు.
ఎందుకంటే ఎప్పటికీ గ్యారెంటీ ఇవ్వని ఉద్యోగాలు చేయడం కంటే ఎప్పటికీ విలువ తగ్గని వ్యాపారులు చేయడం మిన్న అనుకొని చాలా మంది ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మొదలుపెట్టారు. దీంతో పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువగా ఆదాయం అందుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల బిజినెస్ లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇంతకు అవేంటో చూద్దాం.
కిరాణా కొట్టు: కిరాణా కొట్టుకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని ద్వారా మంచి లాభం కూడా ఉంటుంది. హోల్సేల్ మార్కెట్తో సరుకులను సప్లై చేసే నమ్మకస్తులు దొరికితే చాలు పండిందే పంట అని చెప్పవచ్చు. ప్రజలు ఎక్కువగా ఉన్నచోట కిరాణా కొట్టును పెట్టడం వల్ల మంచి లాభం వస్తుంది. దీని ఏర్పాటుకు కూడా కనీసం 50 వేల వరకు అవుతుంది. కానీ ఆ తర్వాత లక్షలలో ఆదాయం పొందవచ్చు.
ideas:
బట్టల వ్యాపారం: ఎప్పటికైనా దేని విలువైన తగ్గుతుందేమో కానీ బట్టల విలువ మాత్రం అసలు తగ్గదు. ఎప్పటికైనా బట్టలు బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. బట్టల వ్యాపారం పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు నష్టపోలేదు అని చెప్పాలి. ఇక ఈ దుకాణంను కూడా మెయిన్ సెంటర్ లో ఉండేలా చూసుకోవాలి. ఇక ఇది పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు ఖర్చయినప్పటికీ కూడా లాభం ఎక్కువగా ఉంటుంది.
ఎంపోరియం: ప్రస్తుతం బంగారం కంటే ఎక్కువగా మామూలు జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు ఆడవాళ్లు. రకరకాల డిజైన్లతో వచ్చిన జ్యువెలరీని, రకరకాల డిజైన్లతో కుట్టించిన దుస్తులను బాగా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి.. ఈ వ్యాపారం మొదలుపెట్టిన కూడా మంచి లాభం ఉంటుంది.