Business Tips: మామూలుగా బిజినెస్ చేయాలి అంటే చాలా మంది పెట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చేతిలో పెట్టుబడి పెట్టడానికి సరైన డబ్బులు లేక ఏం బిజినెస్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేయటానికి ఈమధ్య చాలామంది అంతగా ఆసక్తి చూపించడం లేదు. దానికంటే బిజినెస్ లు చేయడం మంచిది అని అందరూ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఉద్యోగం చేస్తూ బిజినెస్ లు కూడా చేయవచ్చు.
ఈ మధ్యకాలంలో ఫుడ్ కి చాలా డిమాండ్ ఉంది. బయట ఎక్కడపడితే అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అయితే బిజీ లైఫ్ లో ఉన్న వాళ్లకు ఇంట్లో టిఫిన్లు చేసే తీరిక, పచ్చళ్ళు చేసే తీరిక అస్సలు ఉండదు. అలాంటి వాళ్ల కోసం ఈ బిజినెస్ చేస్తే బాగా నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ కి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ బిజినెస్ చేయడానికి సపరేటు షాప్ అవసరం లేదు.
రోడ్లపై కూడా ఈ బిజినెస్ బాగా నడుస్తుంది. ఈ మధ్యకాలంలో టిఫిన్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బిజీ లైఫ్ లో ఉండే వాళ్లకు బియ్యం నానబెట్టి రుబ్బే సమయం ఉండదు కాబట్టి మనమే స్వయంగా దోషల పిండి, ఇడ్లీ పిండి, బియ్యం పిండి ఇలా పలు రకాల టిఫిన్లు చేసే పిండిలను రుబ్బి అమ్మటం వల్ల మంచి ఆదాయం వస్తుంది.
Business Tips:
అంతేకాకుండా పట్నంలో ఉండే వాళ్లకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఇక వీళ్ళకి పచ్చలు చేయడానికి అంతగా రాదు. కాబట్టి రకరకాల పచ్చడిలు పెట్టి అమ్మడం వల్ల మంచి లాభం ఉంటుంది. ప్రస్తుతం ఈ బిజినెస్ చాలా మంది నడిపిస్తున్నారు. ఇక ఉద్యోగస్తులు ఈ బిజినెస్ ను సాయంత్రం సమయంలో చేసుకోవడం వల్ల కూడా నడుస్తుంది.