Business Tips: ఈ మధ్యకాలంలో బిజినెస్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగాలు కంటే బిజినెస్ లు చేయడం వల్ల ఎక్కువ సంపాదించవచ్చు అని అందరు వ్యాపారాల వైపే అడుగుపెడుతున్నారు. ఇక వ్యాపారాలు చేయాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం వ్యాపారం చేయటానికి ఫుడ్ బిజినెస్ మాత్రం అందుబాటులో ఉంది. చాలా మంది ఈ మార్గానే ఎంచుకుంటున్నారు. కానీ ఫుడ్ బిజినెసే కాకుండా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఇంతకు అవేంటంటే..
టైల్స్, శానిటరీ షాప్: ప్రస్తుతం టైల్స్, శానిటరీ వస్తువులు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో టైల్స్ అనేవి బాగా వాడుతున్నారు. మంచి మంచి వాష్ బేసిన్స్, బాత్ టాప్స్, డ్రైనేజ్ పైప్స్ వంటివి కూడా బాగా వాడుకంలో ఉండటం వల్ల ఈ బిజినెస్ బాగా నడుస్తుంది అని చెప్పవచ్చు.
సెకండ్ హ్యాండ్ బైక్స్ కార్స్ కన్సల్టెన్సీ: సెకండ్ హ్యాండ్ కార్లను, బైక్లను అమ్మేవారు, కొనుగోలు చేసేవారి డీల్ చేసి మంచి కమిషన్ పొందవచ్చు. కాబట్టి ఈ వ్యాపారం కూడా బాగానే నడుస్తుంది.
నర్సరీ: ఇక నర్సరీకి ఉన్న డిమాండ్ గురించి చెప్పాల్సిన అవసరం. ప్రస్తుతం అందరూ తమ ఇళ్లల్లో చిన్నచిన్న గార్డెనింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి నర్సరీలో రకరకాల మొక్కలను పెంచి అమ్మడం వల్ల మంచి లాభం ఉంటుంది.
బీరువా తయారీ: బీరువా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. అన్ని భద్రపరచుకోవటానికి బీరువా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీనికి ఎప్పటికైనా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి బీరువా తయారు చేసే వ్యక్తులను ఎంచుకొని మంచి స్థలంలో బీరువాలను తయారుచేసి వ్యాపారం చేయవచ్చు.
Business Tips:
కొవ్వొత్తుల తయారీ: ఒకప్పుడు కొవ్వొత్తులకు డిమాండ్ బాగా ఉండేది. కరెంటు పోతే చాలు కొవ్వొత్తులతో దీపాన్ని వెలిగించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు రకరకాల చార్జింగ్ లైట్లు రావడంతో వీటి వాడుక తక్కువ అయింది. కానీ బర్త్డేలు, ఇతర పార్టీలలో క్యాండిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వీటిని ఇంట్లో ఉండి కూడా తయారు చేసి బిజినెస్ చేయవచ్చు.