Business Tips : గత మూడేళ్లలో చాలా మంది కరోనా వల్ల తమ ఉపాధిని కోల్పోయారు. అలాగే కరోనా వల్ల చాలామందికి ఆదాయ మార్గాలు దెబ్బతినడం తెలిసిందే. చాలా కంపెనీలు నష్టాలను ఎదురుకొని తట్టుకోలేక, ఉద్యోగులను తొలగించుకున్నారు.
దీంతో చాలా మందికి ఉపాధి లేకుండా పోయింది. అయినప్పటికీ ఉద్యోగం పోయిన ఎంతోమంది ఉపాధి కోసం ఏవో ఒక చిన్న చిన్న వ్యాపారాలో లేదంటే ఏవో ఒక పనులు చేసుకునేవారు. కరోనా దెబ్బతో అందరిలో ఓ భయం పెరిగింది.
ఈ ఉద్యోగాల కన్నా వ్యాపారాలు చేసుకుంటే మంచిది అని ఆలోచిస్తున్నారు. అయితే అలాంటి వారికి కొన్ని బిజినెస్ ఐడియాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా పెట్టుబడి ఉండాలి ఈ విషయం అందరికి తెలిసిందే.
అయితే రూపాయి పెట్టుబడి లేకుండా, లక్షల్లో సంపాదించే ఒక బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఈ మధ్య కాలం లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ని మీరు చేయవచ్చు. పెళ్లికి కావాల్సిన అన్ని పనులను చేయడం ద్వారా మీరు ఈ బిజినెస్ ని చేసి బాగా సంపాదించవచ్చు.
అయితే దీనికి పెళ్లికి సంబంధించిన డెకరేషన్ దగ్గరి నుండి పెళ్లి భోజనాలు, డీజే లాంటి అన్ని పనులను దగ్గరుండి చూసుకోవాలి. అలాగే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని అందంగా తయారు చేయడం లాంటివి కూడా చేయాలి. ఉదాహరణకు డెకరేషన్ చేయడానికి చాలా కంపెనీలు, వ్యక్తులు ఉంటారు.
వాళ్లను కాంటాక్ట్ లో పెట్టుకోవాలి. డీజే కూడా ఇలాగే చెయ్యాలి. మన దగ్గర సంవత్సరానికి రెండు మూడుసార్లు పెళ్లిళ్ల సీజన్ వస్తుంటుంది. అయితే పెళ్లి చేసే వాళ్ల బడ్జెట్ ను బట్టి.. మీ కమీషన్ ను పట్టుకోవాలి. దీంతో మీరు బాగా సంపాదించవచ్చు.
Business Tips : ఈ బిజినెస్ తో లక్షల సంపాదన మీ సొంతం..
ఈ బిజినెస్ తో మీరు ఎంతైనా సంపాదించడానికి వీలవుతుంది. అయితే కొన్ని సీజన్ లో మీరు రెండు, మూడు పెళ్లిళ్లు చేసినా లక్షల్లో సంపాదించడానికి వీలవుతుంది. ప్రారంభంలో ఎలాంటి ఆఫీస్ లేకుండా ఇంటి దగ్గరి నుండే చేయవచ్చు. ఆ తర్వాత మీకు వీలైనంత డబ్బు సేకరించుకుని ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు.