Business Tips: ఈ మధ్యకాలంలో చాలామంది బిజినెస్ లవైపే అడుగులు వేస్తున్నారు. ఒకరి కింద బతకడం ఎందుకు అని సొంతంగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. చాలా వరకు ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా అంతగా సంతృప్తి చెందలేకపోతున్నారు. దీంతో వ్యాపారం మొదలుపెట్టాలి అని చాలామంది వ్యాపార రంగాలలో అడుగుపెడుతున్నారు.
అయితే కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్లు కూడా ఎటువంటి వ్యాపారం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉంటున్నారు. ఇక అలాంటి వాళ్లకే ఈ బిజినెస్ ఐడియాలు. ఈ బిజినెస్ ఫాలో అయితే నెలకు 50 వేల నుంచి రూ.లక్ష రూపాయలు సులువుగా సంపాదించుకోవచ్చు. ఇంతకు ఆ బిజినెస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక ఆవును లేదా గేదెను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే పాలను అమ్మడం ద్వారా ప్రతినెల మంచి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో పాలకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి. ఇక ఒక గేదె కొనాలి అంటే రూ.50 వేల నుండి రూ.60 వేలు ఖర్చు అవుతుంది. ఇక ఆవుకి అయితే కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది.
Business Tips
ప్రస్తుతం పెళ్లిలు, ఇతర వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చిన్న వేడుకలు అయినా సరే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వాటిని డెకరేషన్ చేయటానికి ఎక్కువగా పువ్వులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వేడుకల కోసం ఫ్లవర్ బిజినెస్ చేసిన కూడా బాగా నడుస్తుంది. ఆన్లైన్ లో కూడా ఈ బిజినెస్ బాగా కొనసాగుతుంది.
ఇక మీకు పొలం లేదా ఎక్కడైనా భూమి ఉంటే మాత్రం ఆ స్థలంలో టేకు, ఎర కలప వంటి ముక్కలను నాటి మంచి లాభాలు అందుకోవచ్చు. దాదాపు 8 నుంచి 10 ఏళ్లలో చెట్ల నుండి మంచి రాబడి వస్తుంది. ఎలకలప చెట్టుకు రూ.40 వేల వేల వరకు సంపాదించుకోవచ్చు. టేకు చెట్లకు రెట్టింపు సొమ్ము సంపాదించుకోవచ్చు.