Business Tips: ఈ మధ్యకాలంలో ఫుడ్ బిజినెస్ బాగా నడుస్తుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక తినే ఐటమ్ తో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇక ఈ ఫుడ్ బిజినెస్ పెట్టడానికి చాలా తక్కువ ఖర్చుతో పాటు ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి.. అందరూ ఇటువంటి బిజినెస్ వైపే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పబ్లిక్ ప్లేస్ లలో టీ స్టాల్స్, టిఫిన్స్ సెంటర్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ వంటివి పెడుతూ బాగా సంపాదిస్తున్నారు.
అయితే మరో ఫుడ్ బిజినెస్ అయినా హాట్ చిప్స్ తో కూడా మంచి లాభం ఉందని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో చిన్నా పెద్ద అనే వయసుతో తేడా లేకుండా అందరూ చిరుతుల్లు తినడానికి ఇష్టపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఆలుతో తయారు చేసిన చిప్స్, అరటికాయతో చేసిన చిప్స్ ఇలా రకరకాల పదార్థాలతో తయారు చేసిన చిప్స్ ను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడటంతో ఈ బిజినెస్ బాగా రన్ అవుతుందని తెలుస్తుంది.
అయితే ఈ హాట్ చిప్స్ కు ఎంత పెట్టుబడి అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈ చిప్స్ తయారు చేసుకోవడానికి ఒక షాపును అద్దెకు తీసుకోవాలి. ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో షాపును అద్దెకు తీసుకోవాలి. ఇక ఆ షాపును అందమైన ఫర్నిచర్స్ తో డిజైన్ చేయించుకోవాలి. ఇక షాపు ముందే చిప్స్ వేయించుకోవడానికి కిచెన్ సెట్ చేసుకోవాలి. ఇక చిప్స్ తయారు చేసుకోవడానికి ఆలుగడ్డలను, అరటికాయలను మార్కెట్లో తక్కువ ధరలకు తీసుకోవాల్సి ఉంటుంది.
Business Tips ఈ వ్యాపారంతో నెలకు రూ.50 వేలు గ్యారెంటీ..
కేవలం చిప్స్ కాకుండా ఇతర హాట్ ఐటమ్స్ కూడా అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పదార్థాలు తయారు చేయడానికి మంచి వంట నూనెను వాడాలి. లేదంటే సేల్ కావు. కాబట్టి తినే వారిని దృష్టిలో పెట్టుకొని పదార్థాలను మంచిగా తయారుచేసి అమ్మాలి. దీనివల్ల బిజినెస్ మరింత ఎక్కువగా నడుస్తుంది. అయితే ఈ బిజినెస్ పెట్టడానికి సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కసారి రెండు లక్షలు పెట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మాత్రం నెలకు రూ.50,000 వరకు ఆదాయం పొందడం గ్యారంటీ. కాబట్టి ఇటువంటి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ప్రయత్నించండి.