Business Tips: మన ముందు తరం వారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ నేటి తరం యువత ఆలోచనా విధానం అందుకు భిన్నంగా ఉంది. ఎంత పెద్ద చదువుకున్నప్పటికీ ముందుగా అందరూ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వ్యాపారం చేయటం అంతా ఆషామాషీ విషయం కాదు. ముందుగా దాని గురించి పరిశోధన చేయాలి.
అందులో మనకి ఎంత టాలెంట్ ఉందో చూడాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ లో నాలెడ్జ్ లేకపోతే ఆ స్కిల్స్ పెంపొందించుకోవాలి. కొందరికి అన్నీ ఉంటాయి కానీ ఏ బిజినెస్ చేయాలో సరైన అవగాహన ఉండదు. మిడిమిడి జ్ఞానంతోనో, పక్కవారి సలహాలతోనో అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించి తీవ్ర నష్టాల పాలు అవుతారు.
అందుకే వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దాన్ని మన శక్తి సామర్థ్యాలతో విస్తరించేలాగా చేయాలి. అలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఒక మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే టీషర్ట్ ప్రింటింగ్. ఈ టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. దీనికోసం మీరు ఒక్కసారి టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్ కొనుక్కుంటే సరిపోతుంది.
మన బడ్జెట్ ని బట్టి 20వేల నుంచి లక్షన్నర వరకు ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ టైంలోనే ఎక్కువ బిజినెస్ కావాలి అనుకుంటే ఖరీదైన మిషన్ కొనుక్కోవచ్చు లేదు మీ ఏరియాలో అంతా పెద్ద మొత్తంలో బిజినెస్ అవ్వదు అనుకుంటే తక్కువ బడ్జెట్ లో కూడా ప్రింటింగ్ మిషన్ తీసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని మన ఇంట్లో నుంచే ప్రారంభించి తరువాత మెల్లమెల్లగా అభివృద్ధి చేయవచ్చు.
Business Tips:
వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని మెలుకువలు తెలుసుకుంటే సరిపోతుంది ముందుగా మౌత్ పబ్లిసిటీ ద్వారా తర్వాత దగ్గరలో ఉండే స్టోర్ లోకి అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక టీ షర్ట్ ప్రింటింగ్ కి మీకు 10 నుంచి 30 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. మీ టాలెంట్ ని బట్టి మీ వ్యాపార నైపుణ్యాన్ని బట్టి నెలసరి ఆదాయం ఉంటుంది.