Business Tips: తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ మంచి ఉపాధి మార్గం అవుతుంది. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వాళ్ల అభిరుచికి తగ్గ వ్యాపారం ద్వారా కూడా ఉపాధి అవకాశాలని వెతుక్కుంటున్నారు. ఆహార రంగంలో ఉండే వాళ్ళకి ఉపయోగపడే మంచి బిజినెస్ ఇది.
అదే కోడిగుడ్ల సెల్లింగ్ అండ్ బయింగ్ బిజినెస్. కోడిగుడ్ల వ్యాపారం అని చులకనగా అనుకునే వాళ్ళకి వాటిలో ఉన్న లాభాలను చూస్తే కళ్ళు తిరుగుతాయి. కావలసిందల్లా కాస్త శ్రమ, కాస్త మార్కెటింగ్ టెక్నిక్స్. కోడిగుడ్లని హోల్ సేల్డర్స్ దగ్గర కొనుగోలు చేసి వాటిని రెస్టారెంట్లకి చిన్న చిన్న షాపులకి సప్లై చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇది పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు.
దీనికి కావాల్సిందల్లా 10/10 రూం, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటే సరిపోతుంది. హోల్సేల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.4.50 వరకు వుంది. అంటే దీనిని ఒక రూపాయి లాభంతో మనం ఐదున్నరకి అమ్ముకోవచ్చు. ముందుగా ఈ రూపాయి లాభాన్ని పోల్ చైర్స్ రిటైల్ షాపులు డిస్ట్రిబ్యూటర్లతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది.
ఒక కోడిగుడ్డు రూ.4.50 అయినప్పుడు ఒక ట్రే ( 30 గుడ్లు )రూ.135 ఖర్చు అవుతుంది. అదే ట్రేనీ మనం మార్కెట్లోకి తీసుకువెళ్లి అమ్మితే 165 రూపాయల వరకు ధర పలుకుతుంది. అంటే 30 రూపాయలు లాభం వస్తుంది. ఇందులో హోల్ సేల్ వాటర్ 14 రూపాయలు సప్లయర్స్ వాటా ఆరు రూపాయలు అమ్మకం దారు ఆ పది రూపాయలు పోగా మనకి ఆరు రూపాయలు మిగులుతుంది.
ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఎగ్ సప్లయర్ కి ట్రే మీద ఆరు రూపాయలు లాభం వస్తుంది. అలాంటి ట్రేలు ఎన్ని ఎక్కువ అమ్మగలిగితే అన్ని ఆరు రూపాయలు మన ఖాతాలోకి వెళ్ళినట్లే కావాల్సిందల్లా వ్యాపార మెలకువలు మాత్రమే. 20 షాపుల్లో 5 ట్రైలర్ చొప్పున 100 ట్రేలను సప్లై చేస్తే మనకి 600 లాభం వస్తుంది. లెక్కగడితే నెలకి 18000 ఆదాయం వస్తుంది.
Business Tips:
ఈ పని మనం రోజుకి రెండు మూడు గంటలలో చేసేయవచ్చు. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే కేవలం రిటైల్ షాపుల్లోనే కాకుండా రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, క్యాటరింగ్ సంస్థలకి కూడా వ్యాపారాన్ని విస్తరిస్తే మరింత సంపాదన పొందవచ్చు.