Business Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు ఇంటి దగ్గరే ఉండాలని కోరుకోవడం లేదు. బయటికి వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అయితే ఇంటిదగ్గరే ఉండే మహిళలు పిల్లలను చూసుకుంటూనే చేసుకునే సులభమైన బిజినెస్ లు చాలా ఉన్నాయి.
అందులో ప్రధానమైనది కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ అని అందరికీ తెలిసిందే. అయితే టైలరింగ్ వర్క్స్ ద్వారా కొద్ది మొత్తంలో ఆదాయం వస్తుంది. కాకపోతే పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా సాధ్యం అనే సందేహం అందరికీ వస్తుంది. ఇక ప్రస్తుతం టెక్నాలజీకి మీ తెలివితేటలను జోడిస్తే లక్షల్లో సంపాదించవచ్చు.
అందులో ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఎంబ్రాయిడరీ వర్క్స్ ద్వారా మంచి ఆదాయం వస్తుందని అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ ద్వారా చేసే ఎంబ్రాయిడరీకీ డిమాండ్ పెరిగింది. ఒకవేళ మీకు టైలరింగ్ రాకపోతే బాధ అవసరం లేదు. దీనికి కేవలం కంప్యూటర్ వాడడం తెలిస్తే చాలు సులభంగా ఎవరైనా ఈ బిజినెస్ చేయవచ్చు. దీంతో నెలకు లక్షల్లో సంపాదించేందుకు అవకాశం ఉంది.
అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోసం ఓ మిషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక మార్కెట్‌లో మనకు రూ.90వేల నుంచి రూ.25 లక్షల విలువ చేసే ఎంబ్రాయిడరీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్టుబడిని బట్టి మీ వ్యాపారం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి మీకు ఇంటర్నెట్, యూట్యూబ్స్ లో మంచి సమాచారం లభిస్తుంది. అంతేకాదు ఇండియామార్ట్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేస్తే సర్వీస్ కేంద్రం వారే వచ్చి ఫిక్స్ చేస్తారు. అంతే కాకుండా శిక్షణ కూడా ఇస్తారు.
అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్లకు కంప్యూటర్ అనుసంధానించి ఉంటుంది. అందులో కంపెనీ వారు ఇచ్చే డిజైన్లు ప్రోగ్రాం చేసి ఉంటాయి. అయితే కస్టమర్లు ఎంచుకున్న డిజైన్‌ను అందులో ఫిక్స్ చేసి.. క్లాత్‌ను ఒక ఫ్రేమ్‌లో అమర్చి.. దాన్ని మెషిన్ నీడిల్ కింద సరైన పొజిషన్‌లో ఉంచితే చాలు.. ఇక దానంతట అదే స్టిచింగ్ అవుతుంది.
ఇలా ఓ 60 నుంచి 90 నిమిషాల్లో చిన్న మెషిన్లపై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయవచ్చు. పెద్ద మెషిన్లపై ఈ పని 30 నిమిషాల్లోపే పూర్తవుతుంది. ఒకేసారి ఎక్కువ దుస్తులు లేదా క్లాత్‌పై పెద్ద మెషిన్ల ద్వారా ఎంబ్రాయిడరీ చేయవచ్చు. కాకపోతే ఈ మెషిన్ల నిర్వహణకు కేవలం విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది. దీనికి రంగుల దారాలు అవసరం అవుతాయి. కస్టమర్లు ఎంచుకునే డిజైన్‌ను బట్టి ముత్యాలు, పలు రకాల పూసలను అమర్చాల్సి ఉంటుంది.
మార్కెట్ లో ఒక బ్లౌజ్ పై ఎంబ్రాయిడరీ డిజైన్ చేస్తే కనీసం రూ. 300 నుంచి రూ.500 వరకూ చార్జ్ చేస్తున్నారు. ఒక సాధారణ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ ద్వారా ఒక డిజైన్ చేస్తే కనీసం రూ.500 వరకు చార్జి చేయవచ్చు. అందులో ఖర్చులు పోను మీకు రూ.350 వరకు మిగులుతుంది. ఈ క్రమంలో రోజుకు 10 డిజైన్లు వేసినా.. రోజుకు రూ.3500 వరకు.. నెలకు రూ.1,05,000 వరకు సంపాదించవచ్చు.
Business Tips:
బిజినెస్ టిప్: అయితే దీని కోసం దుస్తుల షాపుల వారితో ఒప్పందం చేసుకుని ఆ మేర దుస్తులకు ఎంబ్రాయిడరీ చెయ్యాలి. చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఇంటి దగ్గరే ఉండి మహిళలకు ఇది చక్కని బిజినెస్ ఐడియా అవుతుందని చెప్పవచ్చు.