Chicken Rates : సామాన్యుడుకి కి సైతం అందుబాటులో వుండే చికెన్ ఇపుడు కొనే పరిస్థితి లో లేదు. ఆదివారం వస్తే ముక్క తినాలని అనుకునే వారికి బాడ్ న్యూస్ అనే చెప్పాలి. మామూలుగానే వేసవి కాలం లో చికెన్ ధర లు పెరుగుతుంటాయి. ఈ సీజన్ లో మాములుగా పెళ్లిళ్లు, గ్రామ దేవతల జాతరలు, ఇంటి వారాలు ఇలా అన్నింటికీ చికెన్ ఉండాల్సిందే. మామూలుగానే చికెన్ ను ప్రతిఒక్కరు ఇష్టంగా తింటారు అందులోను ఇలాంటి ప్రత్యేక సందర్భాలు ఎక్కువగా ఉండటం తో ప్రతి సంవత్సరం ఈ సీజన్లో రేట్లు పెరుగుతాయి.
ఇక కరోనా అప్పటినుండి గుడ్డు, చికెన్ లు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్పడం తో దీనికి డిమాండ్ బాగా వుంది. ఇక అందులోను పౌల్ట్రీ ల నుంచి ఉత్పత్తులు సరిగా లేకపోవడం కారణంగా కూడా చికెన్ కు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ధరలు పెరిగాయి.
Chicken Rates ప్రస్తుతం చికెన్ ధరలు ఇలా…..
బ్రాయిలర్ చికెన్…..
గతంలో కిలో బ్రాయిలర్ కోడి చికెన్ రేటు రూ. 220లు ఉండగా, తాజాగా ఈ ధర రూ. 260 నుంచి రూ. 280 మధ్య పలుకుతోంది. ఇక మరో వైపు గతంలో కిలో బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ. 140 నుంచి రూ.150 మధ్య లో ఉంటే. ప్రస్తుతం అది రూ.180 నుంచి రూ. 200 మధ్యలో ఉంటోంది.
నాటు కోడి…..
సామాన్యులకు బ్రాయిలర్ కోడి ధరనే నడ్డి విరుస్తుంటే, ఇక నాటు కోడి ధర కొండెక్కి కూర్చుంది. నాటు కోడి కూడా కొనలేని పరిస్థితులో వున్నారు. ఇక కిలో బరువు వున్న నాటు కోడి రూ. 400 ధర వున్నది ఇపుడు రూ.500 కు చేరుకుంది. ఇక కిలో నాటు కోడి మాంసం కూడా కిలో రూ. 500 ధర చొప్పున అమ్ముతున్నారు.
ఈ ఏడాది వేసవిలో ఉష్నోగ్రతలు తీవ్రత ఎక్కువగా ఉండడం, వేడి గాలులు ఎక్కువగా వీస్తుండడంతో బ్రాయిలర్ కోళ్లు అధికంగా చనిపోతుండడం కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. అయితే వేసవికాలంలో వీటిని ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి పౌల్ట్రీల వద్ద షెడ్డులు ఎపుడు కూల్‌గా ఉంచాలి. ఇందుకోసంపౌల్ట్రీ ల వద్ద డ్రిప్ విధానాన్ని అమలుచేసి షెడ్డులు తడుపుతూ కూల్ గా ఉంచాలి.
అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి పౌల్ట్రీకి కంపెనీలు 4,500 నుంచి 7 వేల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి పిల్లలను అందిస్తాయి.అయితే కొంతమంది సొంతంగా కూడా కొనుగోలు చేస్తారు. ఇవి కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకూ బరువు పెరగడానికి 72 రోజుల సమయం పడుతుంది. కాకపోతే ఈ ఏడాది వేడి తీవ్రతకు కోళ్లు అధికంగా చనిపోయాయి.బ్రాయిలర్ కోళ్లు అధికంగా చనిపోతుండటం కారణంగా దిగుబడి పూర్తిగా పడిపోయి ధర పెరుగుతోంది.ఇక వీటికి జతగా కోళ్లకు వాడే మేత ధరలు కూడా పెరగడం మరో కారణం.. ఏది ఏమైనా సామాన్యుడు చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది.