WhatsApp Loan : ఫైనాన్స్ కంపెనీ CASHe వాట్సాప్ వ్యాపార వినియోగదారుల కోసం ప్రత్యేకమైన క్రెడిట్ సదుపాయాన్ని ప్రారంభించింది. వాట్సాప్ వ్యాపార ఖాతా ఉన్నవారు కేవలం 30 సెకన్లలోనే రుణాలను పొందవచ్చు. అంతేకాకుండా లోన్ పొందేందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. రుణం తీసుకోవాఫామ్ కోసం దరఖాస్తుదారు ఫారమ్‌లను పూరించాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే, లోన్ ఆఫర్‌లను పొందేందుకు ప్రత్యేక అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ ద్వారా రుణం పొందే విధానం……
వాట్సాప్-CASHe తక్షణ రుణాన్ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. WhatsApp చాట్ బాక్స్‌లో HI అని టైప్ చేసి, 8097553191కి సందేశాన్ని పంపాలి. ఇలా పంపించిన తరువాత తర్వాత, వినియోగదారు ముందుగా ఆమోదించబడిన మొత్తాన్ని పొందుతారు. ఇది AI-ఆధారిత క్రెడిట్ లైన్ సౌకర్యం. ఈ సదుపాయాన్ని 24*7 వినియోగించుకోవచ్చు. అయితే, ఉద్యోగస్థులు మాత్రమే ఈ సేవను పొందగలరు.
ఈ సదుపాయానికి భౌతిక KYM చెక్ అవసరం లేదు. మొత్తం ధృవీకరణ ప్రక్రియ ఎలక్ట్రానిక్‌గా పూర్తవుతుంది. దీని తరువాత, సిస్టమ్ క్రెడిట్ లైన్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. వాట్సాప్‌కు భారతదేశంలో మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని సంస్థ వినియోగదారులు ఒకరికొకరు చెల్లింపులు చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.
గమనిక
ఇలాంటి లోన్ తీసుకోవడం అనేది పూర్తిగా మీ ఇష్టం మీద మాత్రమే అదారపడివుంటుంది. ఇక్కడ మీకు సమాచారం మాత్రమే అందించగలుగుతాం.