Gold And Silver Prices Today : గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి, మళ్ళీ ధర పెరిగి మహిళలకు షాక్ ఇస్తోంది . అంతర్జాతీయంగా జరిగే సంఘటనల కారణంగా లేకపోతే బులియన్ మార్కెట్లో సంబవించే మార్పుల కారణంగా బంగారం ధర అదారపడి ఉంటుంది. అయితే ఈరోజు శుక్రవారం ఉదయంకి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. జూన్ 3 నాటికి దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారం మీద రూ.100 పెరిగడంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,600 గా పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,930 గా వుంది. దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలు చూద్దాం.

దేశం లోని ప్రధాన నగరాలలోబంగారం ధరలు…..
తమిళ్నాడు లో ని చెన్నై నగరం లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,750 గా పలుకుతూండగా , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.51,100 గా కొనసాగుతోంది.
ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,600 కొనసాగుతుండగా , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.51,930 గా పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,600 పలుకగా , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,930 వద్ద కొనసాగుతోంది.
కర్ణాటక రాజధాని బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,600 పలుకుతూండగా, 24 క్యారెట్ల తులం బంగారం రూ. 51,930 గా వుంది.
తెలుగు రాష్ట్రాలలో పసిడి ధరలు….
తెలంగాణ లోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 కొనసాగుతోంది .
ఆంధ్రప్రదేశ్ లోనై విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,600 గా ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా పలుకుతోంది.
పసిడిని అనుసరిస్తున్న వెండి…..
బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. స్వల్పంగా తగ్గిన వెండి ఈరోజు పసిడితో పాటు కాస్త పెరిగింది. చెన్నై నగరంలో కిలో వెండి రేటు రూ.67,000 పలుకుతూండగా,ఆర్ధిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.61,400 ఉంది, ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,400 పలుకుతోంది , బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,000 పలుకుతోంది , ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.67,000 ఉంది. ఇక విజయవాడలో కూడా రూ.67,000 వద్ద కొనసాగుతోంది.