Gold & silver rates : అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు సహజం . అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్ల బంగారం ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి . కానీ వెండి భారం బాటలో పయనించకుండా స్థిరంగా ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణం, కేంద్ర రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి

Gold & silver rates : ప్రధాన నగరాల్లో బంగారం ధరలు……
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,010 వద్ద పలుకుతోంది .
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల తులం పసిడి వెల రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,010 కొనసాగుతోంది .
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,650, 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.51,980 వద్ద ఉంది .
ఇక దక్షిణాదిన తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,750 ఉండగా , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,090 వద్ద కొనసాగుతోంది .
కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.52,010 పలుకుతోంది.
కేరళలో 22 క్యారెట్ల తులం పసిడి వెల రూ.47,680 ఉంటే , 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు…..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా , 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది .
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,650 ఉంటే , 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.51,980 పలుకుతోంది .
పసిడి తగ్గుముఖం పడితే, వెండి మాత్రం స్థిరంగా అదే ధరలో కొనసాగుతోంది .
ప్రధాన నగరాల్లో వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండిధర రూ.61,000 ఉండగా..
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,000 వద్ద పలుకుతోంది .
ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది .
తమిళనాడు రాజధాని చెన్నైలో కేజీ వెండిధర రూ.66,300 ఉంటే ,
కర్ణాటక రాజధాని బెంగళూరులో కేజీ వెండిధర రూ.66,300 ఉంది
కేరళలో రూ.66,300 వద్ద కేజీ వెండి ధర పలుకుతోంది .
ఇక తెలుగురాష్ట్రాల్లో వెండి ధరలు …
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కేజీ వెండి వెల రూ.66,300 ఉంటే , ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రూ.66,300 ఉంది. ఇక విశాఖపట్నంలోనూ అద్దె ధర కొనసాగుతోంది.