today-gold-and-silver-prices-in-telangana-andhrapradesh
today-gold-and-silver-prices-in-telangana-andhrapradesh

Gold And Silver Prices : ఈరోజు బంగారం ధర స్థిరంగా వుంది. పండగల వేళ బంగారం,వెండి ధరలు పెరిగి అందిరికి షాక్ కు గురి చేసాయి. అయితే ఈరోజు ధరల ప్రకారం బంగారం, వెండి స్థిరంగా వుంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలలో రోజు అనిశ్చితి మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే బుల్లియన్ మార్కెట్ లో బంగారం ధరల మార్పులకు అనేక కారణాలు ఉంటాయి . అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కేంద్ర రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు, అలాగే ద్రవ్యోల్బణం, రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వల ఆధారంగా బంగారం ధరల్లో, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయి. అందుకే ఒక రోజు ధరలు పెరిగితే మరో రోజు తగ్గుతుంది, ఒకొక్క రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు........
ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు……..

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు పసిడి ధరలు…..

దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 47,700 ఉంటే, 24 క్యారెట్ల తులం బంగారం ధర 52,030 గా కొనసాగుతోంది.

ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.47,550 గా ఉంటే , 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 51,870 గా కొనసాగుతోంది.

పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 47,700గా ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 52,870 గా నమోదైంది.

ఇక దక్షిణాదిన తమిళనాడు రాజధాని చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,450 ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 52,850 గా కొనసాగుతోంది .

కర్ణాటక రాజధాని బెంగుళూరులో తులం పసిడి ధర 22 క్యారెట్ల ధర రూ. 47,600 ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 51,930 గా నమోదైంది .

మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు….

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 48,450 ఉంటే, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,850 గా నమోదయింది .

ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,450 ఉంటే, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 52,850 గా కొనసాగుతోంది .

దేశంలోని వివిధ ప్రాంతాలలో వెండి ధరలు………

దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర 57,400 గా ఉంటే, ఆర్థిక రాజధాని ముంబైలోనూ కేజీ వెండి ధర రూ. 57,400 గా పలుకుతోంది.

ఇక దక్షిణాదిన తమిళ నాడు చెన్నై నగరంలో కేజీ వెండి ధర రూ.63,000 గా ఉంటే, బెంగుళూరు నగరంలోనూ కేజీ వెండి రూ. 63,000 గా కొనసాగుతోంది. కేరళ ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 63,000 గా పలుకుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 63,000 ఉండగా, ఆంధ్రప్రదేశ్ విజయవాడ విశాఖ నగరాల్లో వెండి ధర రూ. 63,000 గా పలుకుతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఆగస్ట్ 8, 2022 at 11:19 ఉద.