Telangana Govt Jobs : తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గత కొన్ని నెలల నుంచి వరుసగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. దీంతో నిరుద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రూప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా… మరో 2391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అందులో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జేఎల్(జూనియర్ లెక్చరర్స్) పోస్టులు ఉన్నాయి. ఇందులో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉద్యోగాలు 480 కాగా, జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలు 185 ఉన్నాయి. ఇక.. పీజీటీ పోస్టులు 235 ఉండగా, టీజీటీ పోస్టులు 324 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం తెలంగాణ నిరుద్యోగులు చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. చాలా కాలం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్స్ అరకొరగానే ఉన్నారు. ఈ రిక్రూట్ మెంట్ తో కాలేజీ లెక్చరర్స్ కూడా ప్రతి కాలేజీకి సరిపడినంతగా ఉండే అవకాశం ఉంది.
Telangana Govt Jobs : నోటిఫికేషన్ ఎప్పుడు?
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. 2391 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో దీని నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక.. దీనిపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలియగానే.. నిరుద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించారు.