Education Loan : ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఇది వరకు బ్యాంకుల చుట్టూ తిరిగే వాళ్లు విద్యార్థులు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ అంతత ఈజీగా ఇచ్చేది కాదు. ఒక బ్యాంకు ఇవ్వము అంటే మరో బ్యాంకు.. ఆ బ్యాంకు ఇవ్వము అంటే ఇంకో బ్యాంకు.. ఇలా అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ చివరకు లోన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. చాలామందికి ఉన్నత చదువులు చదవాలని ఉంటుంది కానీ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోతారు. అటువంటి వాళ్లకు బ్యాంకులు లోను ఇస్తాయి. వాళ్లు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఆ రుణాన్ని తీర్చుతారు. కానీ.. లోన్ పొందడం అనేది అంత ఈజీ కాదు. దాని కోసం చాలా డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
కేవలం రుణం రాకపోవడం వల్ల చాలామంది విద్యార్థుల చదువులు ఆగిపోకూడదనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను తీసుకొచ్చింది అదే విద్యా లక్ష్మీ. ఇక నుంచి ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే విద్యా లక్ష్మీ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఒకేసారి 39 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నట్టే లెక్క. అతి తక్కువ వడ్డీకే విద్యా లక్ష్మీ స్కీమ్ కింద ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తున్నారు. విద్యా లక్ష్మీ పోర్టల్ లో ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు.
Education Loan : ఈ పోర్టల్ లో మూడు రకాల ఎడ్యుకేషన్ లోన్స్ కి దరఖాస్తు
ఈ పోర్టల్ ద్వారా మూడు రకాల ఎడ్యుకేషన్ లోన్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే చాలు. వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ బ్యాంకులో మీకు రుణం కావాలో ఆ బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని బ్యాంకులను అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ష్యూరిటీ లేకుండా 4 లక్షల వరకు లోన్ ఇస్తారు.
ఎక్కువ రుణం కావాలంటే మాత్రం ఏదైనా ష్యూరిటీ సమర్పించాల్సి ఉంటుంది. ఇక.. ఈ స్కీమ్ కింద ఉచితంగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు తాము చదువుకున్న సర్టిఫికెట్లు, ఏ కాలేజీలో చదవబోతున్నారో వాటికి సంబంధించిన అడ్మిషన్ డాక్యుమెంట్లు, ఇన్ కమ్ సర్టిఫికెట్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ లోకి వెళ్లి విద్యా లక్ష్మీ లోన్ అని కొడితే వెబ్ సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి స్టూడెంట్స్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు లోన్ ఇస్తారా లేదా అనేది కూడా వెంటనే తెలుస్తుంది. మీరు ఏ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారో ఆయా బ్యాంకులు మీ అప్లికేషన్ ను చెక్ చేసి లోన్ ఇస్తారా ఇవ్వరా అనేది పోర్టల్ లోనే అప్ డేట్ చేస్తారు.