SSC: మొన్నటి వరకు తెలంగాణాలో నోటిఫికేషన్స్ హడావిడి కొనసాగింది. చాలా నోటిఫికేషన్స్ ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు SSC నుండి మరో 11409 పోస్టులకు నోటిఫికేషన్ విడదల అయ్యింది. ఈనెల 18 నుండి ఈపోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే నెల 17వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19కాగా, చలాన్ ద్వారా చెల్లించే వారికి ఫిబ్రవరి 20 వరకు సమయం ఉంది. అప్లికేషన్ లో ఉన్న తప్పులను సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 23 నుండి 24 వరకు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
ఎంటీఎస్ – 10880
సీబీఐసీలో హవల్దార్, సీబీఎన్ – 529
ఎక్షామ్ ఫీజు:
దరఖాస్తు రుసుము: రూ. 100.
రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వికలాంగులు (పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయించబడ్డారు.
ఏజ్ లిమిట్ :
సీబీఎన్ (రెవెన్యూ శాఖ)లో ఎంటీఎస్, హవల్దార్‌ల కోసం వయస్సు పరిమితి 18-25 సంవత్సరాలు (అంటే 02.01.1998కి ముందు, 01.01.2005 తర్వాత జన్మించిన అభ్యర్థులు కాదు). సీబీఐసీ (దేవాదాయ శాఖ)లో హవల్దార్, ఎంటీఎస్ కొన్ని పోస్టులకు, వయోపరిమితి 18-27 సంవత్సరాలు.
పరీక్షా విధానం:
SSC MTS హవల్దార్: పరీక్షా పథకం పరీక్షలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) (హవల్దార్ పోస్టుకు మాత్రమే) ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష హిందీ, ఇంగ్లీష్ మరియు 13 ప్రాంతీయ భాషలలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించబడుతుంది. ఈపోస్టులకు జీతం 18000 నుండి 20000 వరకు వస్తుంది.
వెబ్సైటు: ssc.nic.in