UGC Bumper Offer : యూనియన్ గ్రాంట్స్ కమిషన్ .. యూజీసీ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పీహెచ్ డీ కోర్స్ కు సంబంధించిన విద్యార్థులకు యూజీసి నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాల వలన డిగ్రీ తో చదువు ఆపేసి, పీ హెచ్ డీ చేయాలని వున్న విద్యార్థులకు యూజీసి తీసుకున్న ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. తాజా నిర్ణయం ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదవకున్న యూజీసి పీహెచ్‌డీ చేసే అవకాశం విద్యార్థులకు కల్పించనుంది.
నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన విద్యార్థులు అందరు పరిశోధనల వైపు కూడా మొగ్గుచూపేలా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. యూజీసి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉన్నత విద్యాసంస్థల్లో ఇప్పటినుండి పరిశోధనలు పెరుగుతాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నారు.

UGC Bumper Offer : యూజీసి తాజా నిర్ణయం యొక్క నిబంధనలు…..
యూజీసీ ప్రకటించిన ఈ నిర్ణయం వెనుక కొన్ని నిబంధనలు వున్నాయి. యూజీసీ తాజా నిర్ణయం ప్రకారం 7.5/10 సీజీపీఏతో నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ఉత్తీర్ణులైనవారు పీహెచ్‌డీకి అర్హులుగా వుంటారు. అయితే ఈ నిబంధనలో కొన్ని సామాజిక వర్గాలవారికి మినహాయింపులు కల్పించింది. కొన్ని సామాజిక వర్గాలు అయిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు సీజీఏ ఏడు శాతం ఉన్నా పీహెచ్ డీ కోర్సుకు అనుమతి ఇస్తారు. అంటే వారికీ మిగతా వారితో పోలిస్తే 0.5 శాతం తక్కువగా ఉన్నా పీహెచ్‌డీకి అర్హులుగా వుంటారు. పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి ‘యూజీసీ కొత్త నిబంధనలు – 2022’ను జూన్ నెలాఖరు లోపు ప్రకటించనున్నారు. ఈ కొత్త విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.