Jobs : జాబ్స్ కి, క్రెడిట్ కార్డు బిల్లు, లోన్స్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. మీరు ఏదైనా లోన్ తీసుకొని సమయానికి ఈఎంఐ పే చేయకపోయినా.. క్రెడిట్ కార్డు తీసుకొని బిల్లు టైమ్ కి కట్టకపోయినా కూడా అది క్రెడిట్ స్కోర్ ని డ్యామేజ్ చేస్తుంది. టైమ్ కి బిల్లు కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది. దాని వల్ల.. భవిష్యత్తులో మీరు ఎలాంటి లోన్స్ తీసుకోవాలని అనుకున్నా బ్యాంకులు ఇవ్వవు. దానికి కారణం.. మీరు సరైన సమయానికి లోన్స్ క్లియర్ చేయకపోవడం. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువ ఉన్న వాళ్లు ఈ జాబ్స్ చేయడానికి అనర్హులు. ఆయా ఉద్యోగాల కోసం నిర్వహించే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లోనూ క్లియర్ గా మెన్షన్ చేశారు.
అసలు ఏ జాబ్స్ కి క్రెడిట్ కార్డు బిల్లు టైమ్ కి చెల్లించని వాళ్లు అర్హులు కారు అంటే.. ముఖ్యంగా బ్యాంక్ జాబ్స్ కి వీళ్లు అర్హులు కారు. నిజానికి బ్యాంక్ జాబ్స్ చేయాలంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ.. కొత్తగా డిగ్రీతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా ఉండాలి. అది తప్పనిసరి చేసింది ఐబీపీఎస్. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా ఐబీపీఎస్ అనే పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాయాలంటే.. ఖచ్చితంగా డిగ్రీతో పాటు క్రెడిట్ స్కోర్ 650 కి మించి ఉండాలి. ఎవరికైతే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుందో వాళ్లు ఈ జాబ్స్ కి అనర్హులు.
Jobs : క్రెడిట్ స్కోర్ కు, బ్యాంకు ఉద్యోగాల అభ్యర్థులకు ఏంటి లింకు?
ఇక్కడ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకే క్రెడిట్ స్కోర్ ను తప్పనిసరి చేశారు. అయితే.. చాలామంది విద్యార్థులు చదువు కోసం రుణం తీసుకుంటారు. కానీ.. చదువులు పూర్తయ్యాక టైమ్ కి లోన్ తీర్చడం లేదు. అందుకే బ్యాంకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్రెడిట్ స్కోర్ ను ఐబీపీఎస్ కంపల్సరీ చేసింది. ఐబీపీఎస్ కంటే ముందే ఎస్బీఐ 2016 నుంచే క్రెడిట్ స్కోర్ ను తప్పనిసరి చేసింది. ఈ మధ్య లోన్స్ తీసుకొని చాలామంది టైమ్ కి కట్టడం లేదు. దాని వల్ల బ్యాంకులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలోనే క్రెడిట్ స్కోర్ బాగున్న వాళ్లనే బ్యాంకు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఐబీపీఎస్ నిర్ణయించింది. ఏది ఏమైనా.. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ స్కోర్ బాగాలేని కొందరు విద్యార్థులు అయితే ఇబ్బందులు పడుతున్నారు.