Antakshari Mantra : అష్టాక్షరీ.. మహామంత్రంగా శాస్త్రాలు పేర్కొంటాయి. అయితే ఈ పవిత్రమైన ‘ఓం నమో నారాయణాయ”* అనే ఎనిమిది అక్షరముల మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదము. సకల పాపరాశి ని ధ్వసం చేయగల శక్తి ఈ మంత్రానికి ఉంది.

మంత్ర విశేషాలు

ఈ మహామంత్రానికి అధిష్టానం సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పు డు లక్ష్మీనారాయణునిగా, విద్యా జ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తాత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదిస్తాడుఏ.

ఏ పురాణంలో ఉందంటే… సమస్త మానవులను తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం.. పదిహేడో అధ్యాయంలో వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం *ఓంనమో నారాయణాయ* అనేది. ఈ మంత్రం ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే శక్తి, ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి.

ఎక్కడ జపించాలి ?
ఈ మహామంత్రాన్ని ఎక్కడ జపించాలి అని అందరికీ సందేహం. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం ఉత్తమం. మానసికంగా నిరంతరం ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇహంలో సుఖశాంతులు, పరంలో మోక్షసిద్ధి కలుగుతాయి

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 24, 2021 at 9:54 ఉద.