Ash Immersion : గంగా… పరమ పవిత్రమైన నది. అంతేకాదు సాక్షాత్తు ఆ పరమశివుడి ఝటాఝూటం నుంచి ఆవర్భివించంది అని ప్రతీతి. అయితే సనాతన ధర్మంలో మానవులు చనిపోతే వారి అస్థికలను గంగలో ఎందుకు కలుపుతారు ? చాలా మందికి వచ్చే సందేహం. మొదలు అసలు అస్థినిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి.

అస్థినిమజ్జనం
మానవుడు చనిపోయిన తర్వాత సాధారణంగా దహనసంస్కారాలు చేస్తారు. దీంతో జీవి తన మృతదేహం నుంచి సూక్ష్మ శరీరంలోకి మారిపోతాడు. అప్పుడు ప్రేతరూపకంగా ఉంటారు. తర్వాత చేసే నిత్యకర్మలు అంటే మొదటి రోజు నుంచి పన్నెండో రోజు వరకు చేసే ఆయా కర్మలు (పూజలు)తో ప్రేతత్వం పోతుంది. అయితే ఈ నిత్యకర్మలో ప్రధానమైనది అస్థినిమజ్ఞనం. మనిషికి దహనసంస్కారం అయిన రెండోరోజు అస్థిసంచయనం చేయాలి. అంటే మంత్రపూర్వకంగా శరీరంలోని ఆయా భాగాల నుంచి ముఖ్యమైన ఎముకలను తీసుకుని వాటిని కుండలో నిక్షిప్తం చేసి దగ్గరలోని నదులలో, వాగుల్లో కలపాలి. అవకాశం ఉంటే గంగా తదితర పుణ్యనదులలో నిమజ్జనం చేయాలి.

Ash Immersion అస్థికలు నిమజ్జనం ఎందుకు చేస్తారు

అయితే ఈ క్రియను ఆయా ప్రాంతాలలో వారివారి ఆచారాలను బట్టి రెండోరోజు నుంచి పదోరోజుల్లోపు చేస్తారు. సాధ్యమైనంత తొందరగా అస్థికలు నదుల్లో కలపాలి. గ్రహణం వస్తే ఇబ్బంది. దీనికి కారణం మానవుడు చనిపోయినా వారి ప్రేత కొంత కాలం అంటే సుమారు 40 రోజులపాటు ఆ శరీరం, వారు వాడిన వస్తువులు, ఎముకలు తదితర ప్రాంతాలలో సంచరిస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వారి అస్థికలను పవిత్రమైన నదుల్లో ముఖ్యంగా గంగాలో కలిపితే వారికి ప్రేతత్వం విముక్తి చెందుతుంది, యాతనా శరీరం రాకముందే కలిపితే వారికి రాబోయే ఉత్తరగతులు మంచివి వస్తాయి.

Antim Sanskara (Asthi Visarjan): Ash Immersion

గంగలో కలపడం వల్ల
గంగలో అస్థికలు కలపడం వల్ల ఏమి ఉపయోగం అనేది అందరికీ సందేహం. సాధారణంగా మనకు దగ్గరలోని ఏ నదులలో కలిపినా వారికి ఉత్తర గతులు మంచివి లభిస్తాయి. అయితే నదులన్నింటిలో పరమపవిత్రమైన గంగలో కలిపితే వారి అస్థికలు గంగలో ఉన్నంత కాలం వారికి సత్గతులు లభిస్తాయి అని పురాణవచనం. కాబట్టి సాధ్యమైనంత తొందరగా చనిపోయినవారి అస్థికలు గంగలో కలపాలి. అవకాశం లేకుంటే గంగా, గంగా, గంగా అనుకుంటూ దగ్గరలోని నదులలో కలపాలి. ఈపనిని పదోరోజులోపల చేయగలిగితే మంచి ఫలితం వస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Raju Kumar

Raju Kumar is the man behind all the Devotional content, having 10+ years of experience in media and news coverage, Raju brings in all the quality content.

Mail

Published on ఏప్రిల్ 10, 2021 at 3:44 ఉద.