Wealth : గోవులు… సాక్షాత్తు దైవస్వరూపాలుగా భావిస్తారు హిందువులు. సమస్త దేవతలకు ప్రతీకగా గోవును ఆరాధిస్తారు. అయితే గోవులకు ఎటువంటి ఆహారాన్ని సమర్పించాలి? ఏం పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.. ..

సాధు జంతువులో గోవు ప్రధానమైనది. గోవులలో అన్ని రకాల దేవత దేవుళ్ళు ఉంటారు. గోవు పవిత్రమైన జీవి. గోవుల నుంచి వచ్చే ఏ పదార్థం అయినా మానవునికి ఉపయోగపడేవిగా ఉండటం విశేషం. ఆ పదార్థాలు వ్యర్థమైనవి కావు. ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే.

గోవుకు సాధారణంగా గరికను ఆహారంగా పెడతారు. కానీ ప్రతి ఆహార పదార్థానికి అది దేవతలు ఉంటారు. మనం పెట్టే ఆహార పదార్థాలు తినగానే ఆ ఆహార పదార్ధం వల్ల సంతుష్టి చెందే అధిదేవత దానికి అనుగుణంగా మనకు ఫలితాలను అనుగ్రహిస్తారు. గోవుకు ఆహారాన్ని సమర్పించి భక్తిపూర్వకంగా 3 ప్రదక్షణలు చేయడం మంచిది. నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్ల ను ఆహారంగా పెట్టడం వల్ల ధనం అభివృద్ధి చెందుతుంది. నానబెట్టిన గోధుమలను ఆహారంగా పెట్టడం వల్ల మన కీర్తి పెరుగుతుంది.

Wealth : గోమాత‌కు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో

బియ్యప్పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన కుసుమాలను ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్ల ను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది.

బీట్రూట్, పాలకూరను ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. బెండ కాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయ పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది.

జొన్నపిండి బెల్లము నీటితో కలిపి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినప పిండి బెల్లం నీటితో కలిపి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం నీటితో కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియనిగ్రహం శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి.

నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి చనగ పప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగ పిండి బెల్లం నీటితో కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధికుశలత కలుగుతుంది. ఇలా ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే పైన చెప్పిన ఫలితాలు వస్తాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 17, 2021 at 3:03 ఉద.