Devotional : కుబేరుడికి ఇలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.

S K

Devotional : కుబేరుడికి ఇలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.  సాధారణంగా బాగా డబ్బు ఉన్న ధనవంతులను కుబేరుడి తో పిలుస్తాము. కుబేరుడు అనగానే అందరికీ వెంకటేశ్వర స్వామి పెళ్లి కి అప్పు ఇచ్చిన వ్యక్తి గా తెలుసు.కానీ కుబేరుని గురించి పూర్తి వివరాలు, మరియు పూజా విధానము చలా మందికి తెలిసి ఉండదు.అసలు ఈ కుబేరుడు ఎవరు అంటే,హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి ఈ కుబేరుడు.

ఎనిమిది దిక్కులలో ఒకటి అయిన ఉత్తరం దిక్కు కి అధిపతి.అనగా కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు.కుబేరుడు తన నగరమైన అలకాపురి లో ఉంటాడు.కుబేరుని భార్య పేరు చార్వి దేవి.అధర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాదిపుడు కూడా.కుబేరుడు అనగా అవలక్షణమైన శరీరము కలవాడు అని అర్థం పేరు కి తగ్గట్టు గానే ఈయ్యన పొట్టిగా కొన్ని అవలక్షణాలు కలిగి ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి.శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్బుడు.బంగారు వస్త్రాలతో మణులు పొడగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన నివాసం అయిన అలకపురం కైలాసం వద్దనే ఉంటుంది.దన ధాన్యాలు ఇంట్లో సమృద్దీ గా ఉండాలి అంటేఅందరూ లక్ష్మి దేవిని పూజిస్తారు.కానీ లక్ష్మి దేవి తో పాటు కుబేరుని కూడా పూజించాలి అని పురాణాలు చెప్తున్నాయి.

ఇంతకీ కుబేరునికి ఏవిధంగా పూజ చెయ్యాలి అంటే,ముందుగా పూజ గదిని బాగా శుభ్రం చేసుకోవాలి.కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు కనుక స్వామి నీ పరసన్నం చేసుకోవడానికి ఉత్తరం వైపు కూర్చోవాల్సి ఉంటుంది.తరువాత ఒక్క పిత పై ఎర్రని వస్త్రం పరిచి దాని పై కలశాన్ని స్థాపించాలి.నేతి తో దీపాలను వెలిగించాల్సి ఉంటుంది.పూజ గదిలో కుబేరుని పటం లేదా కుబేరుని యంత్రం ఉంచాలి.ఆ యంత్రానికి శుద్ధమైన జలం మరియు పంచామృతాలతో అభిషేకించాలి.పూజ ను ప్రారంభించే ముందు గణపతి కి పూజ చేయాలి. తరువాత లక్ష్మి దేవి కి పూజ చేయాలి.ఓం శ్రీ మహాలక్ష్మి యే నమః అనే మంత్రంతో 108 సార్లు జపించాలి తరువాత ఓం శ్రీ కుబేరాయ నమః అని కుబేరుని పటం ముందు జపించాల్సి ఉంటుంది.అలాగే కుబేరునికి ధాన్యం మరియు బెల్లం ను నైవేద్యంగా సమర్పించాలి.పూజ లో కాంస్యం లేదా ఇత్చాడి అబరణలు ఉంచి కూంకుమ సింధూరం అక్షతలతో పూజించాలి.ఈ కుబేరుని పూజ ను సాయంత్రం సమయం నుండి రాత్రి లోపు చేస్తే మంచిది అని పండితులు చెప్తున్నారు.ఇంట్లో దారిద్ర్య బాధలు ఉన్నవారు ఇంట్లో ఈ పుజని తప్పనిసరిగా ఆచరించదగినది .

- Advertisement -