నవగ్రహాలు.. జ్యోతిషశాస్త్రం ప్రకారం మన భవిష్యత్‌ను నిర్ణయించేవి నవగ్రహాలు. హిందూ ధర్మం, జ్యోతిషం నమ్మినవారికి మాత్రమే ఈ కథనం. పండితులు చెప్పిన విశేషాలను తెలుసుకుందాం….
జీవితంతో గ్రహగతుల మూలంగా మనిషికి ఎదురయ్యే ఇంబదుల నుంచి తట్టుకోవడానికి పెద్దలు సూచించిన సులభమైన ప్రక్రియ నవగ్రహ ప్రదక్షిణలు. నిర్దిష్టమైన పధ్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితాలు వస్తాయి.

నవగ్రహా దేవాలయాల్లో ఆయా గ్రహాల స్థితిని పరిశీలిస్తేజ….
నవగ్రహాల మధ్య సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు. సూర్యుని ముందు శుక్రుడు కూడా తూర్పు ముఖముగా ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కుజుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఇక శుక్రునికి కుడివైపు పడమర ముఖంగా చంద్రుడు ఉండగా, ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు. సూర్యునికి వెనుకవైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శనికి ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపు కేతువు దక్షిణాభిముఖంగానూ, ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగాఎక్కువమంది ఆచరించే నవగ్రహా స్థానాలు. ఇక నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు దిక్కున వుంటుంది. ఆలయంలోకి ప్రవేశించే వారు సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లి ఎడమ వైపు నుండి (అంటే చంద్రుడి వైపు నుండి) కుడి వైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి.
ఎప్పుడు చేయాలి ?

నవగ్రహాలక మిగతా దేవుళ్ల వలే ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

ఏం చేయకూడదు ?
నవగ్రహాలకు ప్రదక్షణలు చేసే సమయం ఏం చేయకూడదో తెలుసుకుందాం… నవ్రగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను ముట్టుకుని మరీ నమస్కారాలు చేస్తుంటారు. కానీ ఇది తప్పు. విగ్రహాలను తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. దీక్ష తీసుకున్నవారుగానీ, ముఖ్యమైన పూజలు నిర్వహించేవారు గానీ అభ్యంగన స్నానం చేసి మడి దుస్తులు ధరిస్తే అప్పుడు విగ్రహాలు తాకవచ్చు.

ఏ శ్లోకాలు చదవాలి ?
నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తున్నపుడు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం. చివరగా వరుసగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, కుజుడిని, బుధుడిని, బృహస్పతిని, శుక్రుడిని, శని మహాత్ముని, రాహువును, కేతువును, స్మరిస్తూ ఒక్కక ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి.

బయటకు వచ్చిన తర్వాత పాదాలకు కడుగుకుని పక్కనే ఉన్న ప్రధానదేవాలయంలోని మూలవిరాట్టుకు కనీసం మూడు ప్రదక్షణలు చేసి తీర్థం తీసుకుంటే మంచిది. ఆయా ప్రాంతాలలో అక్కడి పూజారులను అడిగా అక్కడి ప్రాంతం వారు ఆచరించి కొన్ని నియమాలన పాటించండి.
న్యూస్

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 16, 2021 at 5:26 సా.