దేశంలోని అమ్మవారి ఆలయాలకు కొదువలేదు. ఒక్కో దేవాలయం ఒక్క ప్రత్యేకత. దేశంలో అష్ఠాదశ పీఠాలు, 51 శక్తి పీఠాలు. ఇలాంటి వాటిలో తలుపులే లేని దేవాలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది మన తెలుగు రాష్ట్రాలలో ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ప్రస్తుతం తలుపులు లేని అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా లోని తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న సుళ్లూరుపేట అనే గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్న శ్రీ శ్రీ చెంగాలమ్మ తల్లి. ఈ చెంగాలమ్మ తల్లి దేవాలయానికి తలుపులు ఉండవు. అమ్మవారు చీరకట్టుతో, చేతిలో త్రిశూలంతో, తలపై నాగ పడగతో, ఎనిమిది చేతులతో ఉండే రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అమ్మవారు ఎడమకాలితో మహిషాసురుని మర్దన చేసినట్టుగా ఉగ్రరూపంతో ఉంటుంది. సూళ్లూరుపేట గ్రామానికి ఈ పేరు రావడానికి చెంగాలమ్మ అమ్మవారి సంబంధం ఎంతో ఉంది. ఎందుకంటే చెంగాలమ్మ ఆలయం ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పొడవాటి కర్రకు మేకను కట్టి ఆ మేకను మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుడులు తిరుగుతున్న నీటిలో అమ్మవారు దొరికిందన్న గుర్తుతో ఈ పని చేస్తారు. ఈ విధంగా తిప్ప దాన్ని సొల్లు ఉత్సవం అంటారు. కాబట్టి ఈ గ్రామానికి సూళ్లూరుపేట అనే పేరు వచ్చింది.

ఆలయ విశిష్టత
కొన్ని వేల సంవత్సరాల కిందట సుళ్లూరుపేట గ్రామాన్ని శుభగిరి అనే పేరుతో పిలిచేవారు. గ్రామానికి పడమర వైపు కాళంగి నది ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో కొందరు పశువుల కాపరులు ఈ నదిలో స్నానం చేయడానికి దిగేవారు వారిలో ఒకడు సుడిగుండంలో చిక్కుకొని పోయాడు. చనిపోతాడేమో అన్న అతనికి ఒక నల్ల రాయి ఆసరా అయినది. ఆ రాయిని పట్టుకుని సుడిగుండంలో చిక్కుకున్న అతను బయటికి వచ్చాడు. తనను రక్షించిన ఆ నల్ల రాయిని తోటి కాపరులకు చూపించడానికి దాని ఒడ్డున ఉన్న రావి చెట్టుకింద పడుకోబెట్టి వచ్చాడు.

అప్పటికే చీకటి కావడంతో కాపరుల అంతా ఆ రాయిని అక్కడే పడుకోబెట్టి వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత వచ్చి చూస్తే క్రిందటి రోజు పడుకో పెట్టిన రాయి దక్షిణ ముఖంగా లేచి ఉన్నది. అప్పుడే వారికి మరో విషయం తెలిసినది ఆ రాయి అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపమని తెలుసుకున్నారు. ఆ విగ్రహాన్ని ఊరి చివర నుంచి అంటే ఊరి పొలిమేర నుంచి గ్రామంలోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ విగ్రహం ఒక అడుగు అంగుళం కూడా కదలలేదు. అమ్మవారు ఊరి పెద్ద కళ్ళల్లోకి కనిపించి తనను అక్కడినుంచి తరలించవద్దని చెప్పిందట. కాబట్టి దానిని కదిలించకుండా అక్కడే ఉంచి తాటాకులతో ఒక కప్పు వేసి గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించారు.

అమ్మవారు దక్షిణ ముఖం చేసి ఉంటుంది. కాబట్టి అందరూ ఆ అమ్మవారిని టెన్ కాలి అమ్మవారు అని అంటారు. టెన్ అంటే తమిళంలో దక్షిణ అని అర్థం. కాబట్టి ఈ అమ్మవారిని ఆ పేరుతో పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అమ్మవారు ఆలయానికి తలుపులు పెట్టాలని దానికి సంబంధించిన చట్టాన్ని తెచ్చి గుడి దగ్గర ఉన్న రావి చెట్టు కింద పెట్టారు. ఆ వూరి పెద్దకు అమ్మవారు కలలో కనిపించి నా గుడికి ఎలాంటి తలుపులు పెట్టవద్దని చెప్పిందట. భక్తులు ఏ సమయంలో ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చని చెప్పింది అమ్మవారు. తెల్లవారి ఆ గుడి దగ్గరికి వెళ్లి చూస్తే చెక్కల నుంచి మొక్కలు మొలిచాయి. కావున ఆలయానికి తలుపులు పెట్టలేదు. భక్తులు ఎప్పుడైనా సరే 24గంటలు దర్శించుకోవచ్చు. ఇక్కడున్న రావిచెట్టును చెంగాలమ్మ చెట్టు అని పిలుస్తారు.

అవివాహితులు ఆ చెట్టుకు చీర కొంగును కట్టడంవల్ల వివాహం జరుగుతుంది అని నమ్మకం. అమ్మవారి ఆలయంలో కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇంకా నాగ దేవతలు, అభయాంజనేయ స్వామి ఉంటారు. ప్రతి ఏడు సంవత్సరాల కొకసారి అమ్మవారికి తిరునాళ్ళు జరుపుతారు. తిరునాళ్ల సమయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని రూపాన్ని దర్శనమిస్తారు.
రవాణా సౌకర్యం

ఈ ఆలయం మద్రాసు నుంచి ఎనభై మూడు కిలోమీటర్ల దూరం, నెల్లూరు జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి తలుపులు లేని అమ్మవారు మనకెన్నో వరాలను ప్రసాదిస్తుంది. ఇది చాలా శ్రద్ధ గా విని చూడ వలసిన విషయం నమ్మకంతో అందరూ ఈ ఆలయాన్ని దర్శించుకోండి. అంతా శుభం జరుగుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 13, 2021 at 12:08 సా.