Bharadvaja భారతదేశం ఒకప్పుడు సర్వోతృష్టమైన సాంకేతికతో అలరారిన దేశం. కాలక్రమేణా విదేశీ దండయాత్రల నేపథ్యంలో మన పూర్వీకులు రాసిన అనేక గ్రంథాలను, శాస్త్ర సాంకేతిక అంశాలను కోల్పోయాం. వాటి గురించి కొన్నిచోట్ల లభించిన ఆధారాల వల్ల భారద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్ర గంథ్రంలోని విశేషాలు తెలుసుకుందాం….

భారద్వాజ మహర్షి రాసిన బృహద్యంత్ర సర్వస్వము అనేక విశేషాల గురించి వివరించింది. ఈ గ్రంధంలో అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ప్రధానంగా ” విమానాధికారణం” అనే ఒక అధ్యాయం ఉంది. దీనిలో అనేక విమానాలు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు. ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి, భయంకర వాయుగుండాల గురించి, అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణం , అతి శీతలం నుండి విమానం దానిలో ప్రయాణించే వారిని రక్షించేందుకు 13 రకాల దర్పణములు (అద్దములు) గురించి పేర్కొన్నారు.

ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును. ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెవారు .

అంతే కాకుండా కొన్నిరకాల దివ ఔషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు. అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ఇలాంటి గ్రంథాలను వెలికితీసి దీనిపై ప్రయోగాలు చేసి మన పూర్వీకుల సాంకేతికతతో పూర్వ వైభవాన్నిపొందాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 16, 2021 at 9:47 ఉద.