హిందూ సంప్రదాయంలో దీపారాధనకు, హారతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అయితే ఈ దీపాలు అనేక రకాలు. దీపం గురించి వచ్చే సందేహాలను తీర్చడానికి ప్రవచన కర్తలకు కూడా ఓపిక నశించిపోయేలా భక్తులు తమ అనుమానాలను అడుగుతారు. అయితే అసలు దీపాలు, హారతులు రకాలు, వాటికి ఏదేవుడు అధిపతో తెలుసుకుందాం… నిత్యం ఆయా దేవాలయాలలో ఇచ్చే దీపాలు, హారతులను గురించి తెలుసుకుందాం… ఒకే ఒక దీపం – ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతి దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం – రథదీపం, మనిషి – పురుషదీపం, కొండ – మేరు దీపం, శివపంచాకృతులు – పంచ బ్రహ్మదీపం, ఏనుగు ఆకారం – గజ దీపం, ఎద్దు ఆకారం – వృషభ దీపం, కుండ – కుంభ హారతి దీపం అని అంటారు.

హారతుల విశేషాలు ఇవే !
దేవాలయంలో లేదా ఇంట్లో పూజ పూర్తయ్యే సమయంలో ఇచ్చే హరతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆయా హారతుల విశేషాలు గురించి తెలుసుకుందాం..

పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.

కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.

రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.

చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.

నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.

కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.

ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.

కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 14, 2021 at 8:58 సా.