Eliminate your financial woes with this single leaf : ఈ ఒక్క ఆకుతో మీ ఆర్ధిక బాధలు దూరం !
ఆకుతో ఆర్థిక బాధలు దూరం… నమ్మశక్యం కావట్లేదు కదా ! కానీ నిజం ఇలా చేస్తే తప్పక మీ బాధలు పోతాయి. ఇది ఒక పరిహారం. నమ్మకం, విశ్వాసం ఉన్నవారు తమ శక్తిని నమ్ముకుని తమతమ పనులను చేస్తూ దీన్ని కూడా ఆచరిస్తే తప్పక మీ బాధలు తీరిపోతాయి.
ఆ సంగతులేంటో తెలుసుకుందాం…
సాధారణంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో బాధపడుతుంటారు. వీటన్నింటి నుంచి బయటపడడానికి కుటుంబంలో వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి కేవలం మన శక్తి సరిపోదు. వద్దనుకున్నా కొన్ని అనవసర ఖర్చులు వస్తుంటాయి వాటి నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలు పెద్దలు చెప్పారు. వాటిలో ఒకటి… ఇంట్లో డబ్బు స్థిరంగా నిలబడ్డానికి ఒక మంచి తేలికైన పరిహారాన్ని తెలుసుకుందాం.. ఒక ఆర్థిక సమస్యలే కాకుండా ఇంట్లో ప్రశాంతత పొందటానికి కూడా ఈ తంత్రం పనిచేస్తుంది.
ఏం చేయాలి ?
ఒక శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉపశమనం కలుగుతుంది. ఈ తంత్రానికికి కావలసింది ప్రధానమైనది రావి ఆకు. శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అది దేవాలయంలో రావిచెట్టు సరిపోతుంది. లేదా బయట ఎక్కడైనా రావిచెట్టు అయినా సరే సరిపోతుంది. ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్లి కింద పడ్డ మంచి రావి ఆకును తీసుకొండి. ఎలాంటి చినుగులు అంటే కట్ కాని రావి ఆకులు తీసుకోండి. దానిని ఇప్పుడు గంగా జలంలో గంగా జలం దొరకకుంటే అప్పుడు బోర్ వేసి లేదా నల్ల నుంచి వచ్చే శుభ్రమైన నీటిని తీసుకోని పసుపు కలిపి ఆ జలంతో శుభ్రపరచుకోండి. తర్వాత ఆకు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి.
మీకు ఉన్న ఆర్థిక బాధలు అప్పుల సమస్యలు తొలగిపోవాలని చెప్పుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ అకును మీ పూజ మందిరంలో పెట్టుకోండి. ఈ విధంగా శనివారం రోజు మొదలుపెట్టి చేసిన ఈ ఆకు పూజ మళ్ళీ శనివారం వరకు ఉద్వాసన చేయకూడదు. మళ్లీ శనివారం రోజు ఈ ఆకును ఉద్వాసన చెప్పి పారే నదిలో లేదా కాలువలో వేయండి. మళ్లీ కొత్త ఆకులు తీసుకొచ్చి మళ్లీ గంగా జలంతో శుద్ధి చేసి అదేవిధంగా స్వస్తిక్ గుర్తు వేసి పూజ గదిలో పెట్టుకోండి.
ఈ విధంగా వరుసగా ఎనిమిది శనివారాలు చేయండి. తొమ్మిదవ శనివారం రోజు 5 రావి ఆకులను తెచ్చుకొని గంగాజలంతో శుభ్రపరిచి సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకోండి. అయితే ఈ ఆకుల నీటిని తర్వాత రోజు పసుపు వస్త్రంలో చుట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఈ తంత్రాన్ని భక్తితో చేయడంవల్ల నమ్మకం, విశ్వాసంతో చేయడంవల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక శనివారం నాడు పూజ చేసిన ఆకులు పారే నదిలో వేయండి.
రావి ఆకు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. విష్ణు ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతోషపడుతుంది. అంతేకాదు ఆమె అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ అశ్వత్త ఆకును పూజించడం వల్ల మంచి జరుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వృక్షాలలో అశ్వత్థ వృక్షంగా పేర్కొన్న విషయం గుర్తుచేసుకోండి. ఏ పని చేసిన నమ్మకంతో, విశ్వాసంతో చేయడంవల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతా. ఇది మతవిశ్వాసం ఉన్నవారు కోసం చెప్పబడిన తంత్రం దీనిలో ఎటువంటి ఖర్చు, మోసం లేదు. ఇష్టం ఉంటే చేయండి. ఫలితాలను కామెంట్ రూపంలో పెట్టండి.