Gold Price: బంగారం వెండి ధరలు మళ్లీ ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. మొన్న అరవై వేలు దాటిన బంగారం ధర నిన్న కాస్త శాంతించింది అనేటప్పటికీ మళ్లీ ధర పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. ఫెడ్ వడ్డీరేట్లు పెరిగితే సాధారణంగా బంగారం వెండి ధరలు పడిపోతాయి. అయితే ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు పెంపుని నిలిపివేసే యోచనలో ఉన్నట్టు వార్తలు రావటంతో డాలర్ రేట్ పడిపోయింది.
దాని ప్రభావం బంగారు వెండి ధరల మీద పడింది. ధరల మార్పులో హెచ్చుతగ్గులు ఉండడం సహజమే కానీ భారీ హెచ్చుతగ్గులు నమోదు అవుతుండడంతో బంగారం కొనాలా,వద్దా అని సందిగ్దానికి గురవుతున్నారు పసిడి ప్రియులు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంపును భవిష్యత్తులో నిలిపివేసే యోచనలో ఉండటం అనేది బంగారాన్ని ఎటు నడిపిస్తాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాదులో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాదులో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు 600 మేర పెరిగి రూ.54800 కు చేరుకుంది. ఒక్క రోజులోనే రూ.800 పెరిగి జనాలకు షాక్ ఇచ్చింది బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో ఒక్క రోజులో 650 రూపాయలు పెరిగి రూ.59,750 కి చేరుకుంది.
ఇదే 10 గ్రాముల బంగారం నాలుగు రోజుల క్రిందట రూ.60,320 రేటుకి చేరి ఆల్ టైం రికార్డు కి చేరువైంది. అదే అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ కు 2000 డాలర్లకు అత్యంత చేరువలో ట్రేడ్ అవుతుంది. అదే వెండి విషయానికి వస్తే 23 డాలర్ల పైకి చేరింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా మెరుగయింది ప్రస్తుతం 82 రూపాయల 24 వద్ద కొనసాగుతుంది.
Gold Price:
దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. 22 క్యారెట్ల బంగారం 600 పెరిగి 10 గ్రాములు రూ.54,950 దగ్గర ఉండగా 22 క్యారెట్లు 650 మేర పెరిగి రూ.59,930 వద్దకు చేరింది. వెండి కూడా బంగారం వెనకే పరుగులు తీస్తోంది. ఒక్క రోజులోనే కిలో మీద 1400 పెరిగి అందరికీ షాక్ ఇస్తుంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.75,400. ఢిల్లీలో వెయ్యి రూపాయల మేర పెరిగి రూ.72,600గా నమోదయింది.