Gold Price: ప్రస్తుతం పెళ్లిల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో రోజురోజుకు ధరలు చూసుకుంటూ.. ధరలు పెరుగుతున్న కొద్ది వెనుకడుగు వేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఈ ధరను చూసి నివ్వెరపోతున్నారు.
ఇక ఈ సంవత్సరంలోని చివరి నెలలో అడుగుపెట్టాం. అయితే ఈ నెలలో ధరలు ఏమైనా తగ్గుతాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ధరలు మాత్రం గత నెల నవంబర్ లాగానే కొనసాగుతున్నాయి. గత పది రోజుల్లో బంగారం ధరలు ఒక రెండు సార్లు తగ్గగా.. ఇక మూడు రోజుల నుండి మాత్రం రూ.900 పెరిగి షాక్ ఇచ్చింది.
కేవలం బంగారమే కాదు వెండి ధర కూడా పెరుగుతూ షాక్ ఇస్తుంది. అయితే ఈ రోజు బంగారం ధరలు చూస్తే మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల పై రూ. 550 పెరుగగా రూ.48,750 నుండి దాదాపు రూ. 49,300 కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.53,180 నుంచి దాదాపు రూ.53,780కు చేరుకుంది. నగల తయారీకి వాడే బంగారం రూ. 50,000 పలుకుతుంది. ఇక స్వచ్ఛమైన బంగారం ధర రూ.55,000లో తిరుగుతుంది.
Gold Price:భవిష్యత్తులో మరింత పెరుగనున్న బంగారం ధర..
ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా బాగానే పరుగులు తీస్తుంది. ఈరోజు కిలో వెండి గమనించినట్లయితే రూ.70,000 దాటింది. అనగా కిలో వెండి పై రూ.700 పెరగటంతో అంటే రూ.69,800 నుంచి రూ.70,500 వరకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు బాగా ఊపుతున్నాయి. ఇక ఈ ధరలను చూస్తే ఈ సమయంలో తగ్గేలా లేవు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కాబట్టి మరింత ధరలు పెంచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు.