Rudraksha Tree : రుద్రాక్షలకు మన పురాణాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలోనూ రుద్రాక్షను చాలా విలువైనదిగా భావిస్తారు. రుద్రాక్షలంటే శివుడికి చాలా ఇష్టం. కొన్ని రకాల రుద్రాక్షలు చాలా అరుదుగా లభిస్తాయి. ఆ రుద్రాక్షలను ధరిస్తే చాలా మంచిదని పండితులు చెబుతుంటారు. అయితే.. ఈ రుద్రాక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు.. ఇవి చెట్టుకు కాస్తాయా? లేక వీటిని తయారు చేస్తారా? అనే విషయాలు చాలామందికి తెలియదు.

చాలామంది సన్యాసులు, పండితులు, అఘోరాలు, పూజారులు.. రుద్రాక్షలను ఎక్కువగా ధరిస్తుంటారు. అయితే.. రుద్రాక్షలు అనేవి కూడా ఒక పండు లాంటివే. ఇవి చెట్టుకే కాస్తాయి. అవి చెట్టుకు కాసినప్పుడు నీలిరంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే కాస్తాయి. మన వాతావరణంలో పండవు. కానీ.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వీటిని ఇంట్లో కూడా పండిస్తున్నారు. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా రుద్రాక్షలను పండిస్తున్నారు.

Rudraksha Tree : రుద్రాక్షను ఇంట్లోనే పండించడం ఎలా?
రుద్రాక్ష మొక్కలు.. కొన్ని నర్సరీలలో అందుబాటులో ఉంటాయట. ఒక్క రుద్రాక్ష మొక్క దొరికినా చాలు.. దాని నుంచి వందల రుద్రాక్ష మొక్కలను తయారు చేయొచ్చట. రుద్రాక్ష మొక్కలను ఎలా పెంచాలి? దానికి సంబంధించిన టిప్స్ ను పంచుకున్నారు ఢిల్లీకి చెందిన రచనా జైన్. తను Indraprastha Horticulture Society(HIS) ఫౌండర్.
రుద్రాక్ష శాస్త్రీయ నామం.. Elaeocarpus ganitrus. ఒక రుద్రాక్ష మొక్క దొరికినా సరే.. దాని నుంచి వందల వరకు చిన్న చిన్న రుద్రాక్ష మొక్కలను తయారు చేయొచ్చని చెబుతున్నారు రచన. దాని కోసం చెట్టు బెరడు దగ్గర రెండు ఇంచుల మందం స్కిన్ తీసేయాలి. అయితే.. ఆ మొక్క చాలా సన్నగా ఉంటుంది కాబట్టి.. కొంచెం బెరడు తీసినా పర్లేదు. అక్కడే మరో మొలక వస్తుంది. అలా వచ్చిన మొలకలను నెమ్మదిగా తెంపి.. ఆ మొక్కను గాలి తగిలేలా.. Air layering process ఉపయోగించి కట్టు కట్టాలి. అయితే.. కొంచెం యాలకుల పొడి కానీ.. తేనెను కానీ తీసుకొని.. ఆ మొక్క కింద పోసి.. ఆ మొక్కను కింది భాగాన్ని కాసేపు నీటిలో ముంచాలి. దాని వల్ల.. మొక్క కొన్ని రోజుల వరకు నీళ్లు లేకున్నా బతకగలుగుతుంది. ఆ తర్వాత ఒక షీట్ తో దాన్ని కవర్ చేయాలి. కొన్ని రోజులు దాన్ని అలాగే ఉంచి.. ఆ తర్వాత దాన్ని ఒక కుండలో పెట్టాలి. దాంట్లో బలమైన మట్టి పోసి.. దానితో పాటు.. ఆవు పేట, కంపోస్ట్ ఎరువును వేయాలి. బూడిద ఉంటే అది కూడా వేస్తే బెటర్. అది పెరుగుతున్నా కొద్దీ దానికి సూర్యరశ్మి తగిలేలా చేయాలి.

కనీసం ఒక సంవత్సరం పాటు.. దాన్ని కాపాడుకుంటే.. ఆ తర్వాత ఆ చెట్టు కాయలు కాస్తుంది. ఆ కాయలే రుద్రాక్షలుగా మారుతాయి. అలా.. ఇంట్లోనే రుద్రాక్షలను ఈ టిప్స్ ఫాలో అయి పండించుకోవచ్చు.