Ashada Masam ఆషాఢం అంటే అందరికీ తెలిసేది కొత్తగా పెండ్లి అయినవారికి ఎడబాటు. షాపింగ్‌ మాల్స్లో ఆషాఢం స్పెషల్ ఆఫర్లు. అయితే ఆషాఢమాసం అనేక అరుదైన విశేషాలు కలిగిన మాసం. వాటిలో కొన్ని తెలుసుకుందాం…

నాల్గో మాసం
ఆషాఢమాసం అంటే… పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెల. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దీంతో దక్షిణాయనం పారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు.

పండుగలు ప్రారంభానికి సంకేతం !
ఇక దీక్షలు, ప్రత్యేకమైన పండుగల ప్రారంభానికి సంకేతంగా ఈ మాసం నిలుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు.

ఏం చేయాలి ?
ఆషాఢమాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాడ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 16, 2021 at 9:55 ఉద.