Main Door Vastu : ఇల్లు.. ప్రతి ఒక్కరికి జీవితంలో కల. అంతేకాదు తప్పనిసరి అవసరమైనది. సొంత ఇల్లు స్వర్గంతో సమానం. పొద్దస్తమానం పనిచేసినా రాత్రికి సొంత ఇంటికి వచ్చి నిద్రపోతే చాలు అనుకుంటారు జీవులు. కేవలం మానవులే కాదు పక్షులు, పశువులు కూడా వాటి నివాసప్రాంతాలకు వస్తాయి. అయితే ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారం ఎటువైపు ఉండాలి అనేది సందేహం.

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి కోరకు మీ పేరు (వ్యవహారనామం)లోని మొదటి అక్షరముతో మీరు ఉండే ఇల్లు ప్రధాన ద్వారం ఎంత వరకు మీకు అనుకూలమో చూసుకోండి. మీ గృహానికి సింహద్వారాన్ని ఎంచుకోవాలి అంటే మిమ్మల్ని అందరు ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకొని కింద తెలిపిన పట్టిక వర్గులలో మీ పేరుకు ఏ దిశ అనుకూలమో చూసుకుని గృహ నిర్మాణం కాని, అద్దెకు ఉండడానికైన సరే మీ ఇంటి యజమాని పేరు మొదటి అక్షరం సహాయంతో నిర్ణయం తీసుకోవాలి.

జాతక జన్మనక్షత్ర ఆధారంగా వచ్చిన జన్మనామము ఇంటి సింహాద్వారా నిర్ణయానికి పనికిరాదు. గృహానికి దిశను సరిగ్గా గుర్తించే కంపాస్ సహాయంతో దిక్కులను గుర్తించి సరిపోయే గృహ ప్రధాన ద్వారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఉండేది స్వంత ఇల్లా, కిరాయి ఇల్లు అయిన సింహా ద్వార నిర్ణయంలో పద్ధతి ఒకటే. వాటి ఫలితాలు ఒక్కటే కావున మీకు సరిపడ సింహద్వారాన్ని ఎంచుకుని హయిగా జీవించండి.

Main Door Vastu : అక్షరం ప్రకారం ప్రధానద్వార దిక్కు

అ నుండి అం,ఆ: వరకు (ఆ-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ ద్వారములు అనుకూలం.(సరిపడని దిశ ఉత్తర సింహద్వారం.)

క ,ఖ,గ,ఘ,ఙ (క -వర్గు)దక్షిణం,పడమర దిశ సరిపోయే సింహద్వారము. (సరిపడనివి దిశలు తూర్పు, ఉత్తరం) చ,ఛ,జ,ఝ,ఇ+(ఛ-వర్గు)తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు. (సరిపడని దిశ సింహద్వారం దక్షిణము)

ట,ఠ,డ,ఢ,ణ (ట-వర్గు) తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు. (సరిపడని దిశ సింహద్వారము దక్షిణము)

త,ద,ధ,న (త-వర్గు)తూర్పు, ఉత్తరం దిశ సరిపోయే సింహద్వారములు. (సరిపడని దిశ సింహద్వారము దక్షిణ, పడమర)

ప,ఫ,బ,భ,మ (ప-వర్గు) తూర్పు, ఉత్తరము దిశ సరిపోయే సింహద్వారములు (సరిపడని దిశ సింహద్వారము దక్షిణం,పడమర)

య,ర,ల,వ (య-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ సరిపోయే సింహద్వారములు. (సరిపడని దిశ సింహా ద్వారం ఉత్తరం)

శ.ష,స,హ (శ-వర్గు) దక్షిణం,తూర్పు దిశ సరిపడే సింహద్వాములు. (సరిపడని దిశ సింహ ద్వారము ఉత్తర మరియు పడమర).

పై అక్షరాల ప్రకారం వారివారి గృహ ద్వారాలను ఎంపికచేసుకోండి. శుభఫలితాలను పొందండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 17, 2021 at 2:55 ఉద.