Naga Dhosham : నాగదోషం.. జాతకంలో ఆయా గ్రహస్థితులను బట్టి నాగదోషాన్ని నిర్ధారిస్తారు. అయితే జాతకాలు లేనివారు తమకు నాగదోషం ఉందా లేదా అని చూసుకోవడానికి కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అవి..
జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు.

జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం వంటివి జరిగితే మీకు నాగదోషం ఉన్నట్లుగా భావించవచ్చు. వాటి నివారణకు మీర చేయాల్సిన పని ఒకటే అది….

– దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా దానదికములు చేసిన నివారణ అవుతుంది. లేదా ఆరు ముఖాలు గాని, గణేశ్ రుద్రాక్ష గాని, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకలతో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించుట శుభమగును. ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట, పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారన కలుగును. నాగ ప్రతిమ (సుబ్రహ్మణ్య) 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట వలన మంచి ఫలితం వస్తుంది. ఇక ఇదేవిధంగా ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును. నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును.రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.

ప్రతీ ఆదివారం ఉపవాసం చేస్తూ, నాగదేవతాలయం చుట్టు ప్రదక్షిణలు చేయాలి. ఈ సమయంలో శ్రీ లలితా సహస్రనామాలు గాని, దుర్గా సప్త శ్లోకి పఠించిన శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా తీవ్ర నాగదోష ప్రభావం ఉన్నవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన దోష నివృత్తి జరుగుతుంది. పైవేవీ వీలుకాని వారు నిత్యం సుబ్రమణ్య ఆరాధన లేదా అమ్మవారి ఆరాధన చేయాలి. దీంతోపాటు అవకాశం ఉన్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అవుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 16, 2021 at 5:41 సా.