Navagraha : నవగ్రహాల బాధల నుంచి తప్పంచుకోవడానికి అనేక పరిష్కారాలు పెద్దలు సూచించారు. వాటిలో అత్యంత శక్తివంతమైన వాటిలో నారసింహ ఆరాధన ఒకటి. ముఖ్యంగా పండితుల నుంచి పామరుల వరకు సులభంగా నవగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. అవి ఈ కింది నవ నారసింహ క్షేత్రాలను సందర్శించాలి…

ఈ గ్రహానికి ఏ క్షేత్రం సందర్శించాలో తెలుసుకుందాం…
జ్వాలా నరసింహ క్షేత్రము. — కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి. నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. ప్రస్తుతం యాదాద్రిగా పిలువబడుతున్నది.

ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని “జ్వాలా నరసింహుడు” గా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

అహోబిల నరసింహ స్వామి. — గురుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి. నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా “స్వయంభు” తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు.

ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

మాలోల నరసింహ స్వామి..శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి.. వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా “మా” అనగ లక్ష్మి లోల యనగ “ప్రియుడు” అని అర్ధం.

ఈ దేవాలయానికి మార్కొండ లక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వరాహ నరసింహస్వామి – రాహుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి. వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు.ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ నరసింహస్వామి – చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహస్వామి..సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును .

యోగనరసింహస్వామి..శనిగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు.
ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

చత్రవట నారసింహస్వామి – కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి – బుధగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి.. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 29, 2021 at 8:42 ఉద.